PM Modi Speech : మహిళల కలలను చిదిమేశారు – ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

కొందరికి దేశం కంటే రాజకీయాలే ఎక్కువ-మోదీ
మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం-మోదీ
కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ వంటి..
కుటుంబ వారసత్వ పార్టీలు చప్పట్లు కొట్టాయి
మహిళా రిజర్వేషన్లను ఆపి సంబరాలు చేసుకున్నారు
రిజర్వేషన్లు అడ్డుకున్నవారికి శిక్ష తప్పదు-మోదీ
కాంగ్రెస్‌, మిత్రపక్షాలు భ్రూణ హత్యకు పాల్పడ్డాయి
మహిళారిజర్వేషన్లు తెచ్చే ప్రయత్నం ఎప్పుడు చేసినా..
కాంగ్రెస్‌ అడ్డుకుంటూనే ఉంది-ప్రధాని మోదీ
దేశంలో కాంగ్రెస్‌ ఉనికి కోల్పోతూ వచ్చింది
ఉనికి కోసం ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపింది
కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, టీఎంసీ, డీఎంకేలు..
పదే పదే అదే పనిచేస్తూ వచ్చాయి-ప్రధాని మోదీ..

BB6 TELUGU NEWS CHANNEL
PM Modi Speech Women Reservation Bill : రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు మహిళల కలలను చిదిమేశాయని ప్రధాని మోదీ విమర్శించారు. కోటా బిల్లును నెగ్గకుండా చేసి విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని దుయ్యబట్టారు.

మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం దారుణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టామని… కానీ కాంగ్రెస్, డీఎంకే కలిసి బిల్లును అడ్డుకున్నాయన్నారు.రిజర్వేషన్ల కోసం తన పోరాటం ఇంకా ముగియలేదన్నారు.

శనివారం జాతిని ఉద్దేశించిన మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ…. ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు లోక్‌సభలో వీగిపోవటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు మహిళా సాధికారతకు అడ్డుపడి పెద్ద పాపం చేశాయని ధ్వజమెత్తారు.

నల్ల దుస్తులు ధరించినంత మాత్రాన చీకటి ఒప్పందాలను దాచి పెట్టలేరని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. “నేను అన్ని పొలిటికల్ పార్టీలతో పర్షనల్‌గా మాట్లాడాను. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరాను. మహిళా రిజర్వేషన్ల విషయంలో అవసరమైతే మీరే క్రెడిట్ తీసుకున్నా పర్వాలేదని చెప్పాను. చివరకు కాంగ్రెస్, డీఎంకే కలిసి బిల్లును అడ్డుకున్నాయి. ఈ విషయంపై డీఎంకే, కాంగ్రెస్‌కు సరైన సమాధానం చెప్పాలి” అని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు.

మహిళలకు క్షమాపణలు – ప్రధాని మోదీ
విపక్షలన్నీ కలిసి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలను విఫలం చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశంలోని మహిళలందరి నుంచి క్షమాపణ కోరుతున్నానని వ్యాఖ్యానించారు. మహిళా అధికారాన్ని ప్రతిపక్షాలు పెద్దగా పట్టించుకోలేదన్నారు.

“మహిళా రిజర్వేషన్లు బిల్లు ఎలా నిలిపివేయబడిందో దేశంలోని ప్రతి పౌరుడు చూస్తున్నాడు. దేశ మహిళల కలలు నిర్దాక్షిణ్యంగా అణిచివేయబడ్డాయి. మేము చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ… విజయం సాధించలేకపోయాము “అని ప్రధాని మోదీ మాట్లాడారు.

మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు పాపం చేశాయని… దీనికి వారు ఖచ్చితంగా శిక్షించబడతారని అన్నారు. బిల్లును ఓడించి ప్రతిపక్ష పార్టీలు మన రాజ్యాంగాన్ని అవమానించాయని వ్యాఖ్యానించారు.

“కాంగ్రెస్ తన గత తప్పులను సరిదిద్దుకుంటుందని నేను ఆశించాను. కానీ కొత్త చరిత్ర లిఖించే అవకాశాన్ని కోల్పోయింది. కుటుంబం నడుపుతున్న పార్టీలు మహిళలు ముందుకు సాగాలని కోరుకోవడం లేదు… ఎందుకంటే అది వారి స్వార్థపూరిత రాజకీయాలకు ముగింపు పలుకుతుంది” అని ప్రధాని మోదీ చెప్పారు.

“కాంగ్రెస్ పరాన్నజీవిలా తయారైంది. ఇతర పార్టీలపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు దక్కేలా బిల్లు తెచ్చాం. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చాం. కానీ దీన్ని ఒప్పుకోవడానికి విపక్షాలు సిద్ధపడలేదు. దేశ ప్రజలను విభజించి లబ్ధి పొందాలన్నది కాంగ్రెస్ ఆలోచన. డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నారు” అని ప్రధాని మోదీ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఉత్తర-దక్షిణ విభజన అంటూ విషప్రచారం చేస్తూ దేశ నిర్మాణాన్ని అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. ఈ బిల్లు ఎవరి హక్కులను లాక్కోవడానికి కాదని, మహిళల సాధికారతకు రెక్కలు తొడగడానికేనని మోదీ స్పష్టం చేశారు. నారీ శక్తి వందన్ అధినియం ద్వారా దేశవ్యాప్తంగా సమానమైన అభివృద్ధిని సాధించాలన్నది తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe