BB6 TELUGU NEWS CHANNEL
‘కాటారం’ సభలో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డిరైతు భరోసా పథకం కింద రెండో విడతనిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది.ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో నిధులను విడుదల చేయనున్నారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు సాయం అందనుంది.
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది.ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో నిధులను విడుదల చేయనున్నారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు సాయం అందనుంది. ఇందుకోసం దాదాపు రూ.5,653 కోట్లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతుభరోసా పథకం కింద ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది.
ఎకరానికి సంవత్సరానికి రూ.12వేల చొప్పున, యాసంగి సీజన్ కు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటికే గత నెల 23న తొలి విడతలో 68,89,955 మంది రైతులకు చెందిన 57,44,907 ఎకరాల భూమికి గాను రూ.3,446.94 కోట్లు విడుదల చేశారు.మొదటి విడతలో ప్రతి రైతుకు ఒక ఎకరం వరకు పెట్టుబడి సాయం అందించారు.రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా, విడతల వారీగా అందరికీ సాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రేపే (ఏప్రిల్ 20) రైతు భరోసా రెండో విడత 45 లక్షల మందికి పైగా.. రైతుల ఖాతాల్లో నిధుల జమ
19
Apr