ఉత్తమ ఉపాధ్యాయ, జానపద కళా రంగం, ఉత్తమ మోటివేటర్ సేవా పురస్కారం అందుకున్న చందు వెల్మ దాసరి

BB6 TELUGU NEWS CHANNEL
ఉత్తమ ఉపాధ్యాయ, జానపద కళా రంగం, ఉత్తమ మోటివేటర్ సేవా పురస్కారం……..             చందు వెల్మ దాసరి. గ్రామం నర్సింగాపూర్ మండలం ధర్మారం జిల్లా పెద్దపల్లి రాష్ట్రం తెలంగాణ. ప్రస్తుతం ఈ ఉపాధ్యాయుడు (అల్ట్రాటెక్ సిమెంట్ వాట్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇండియా మిషన్ సెకండరీ పాఠశాల బసంత్ నగర్ లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు . ఉపాధ్యాయుడు  తెలుగును సులభ రూపంలో వివిధ కథల రూపంగా విద్యార్థిని విద్యార్థులకు గుండెకు హత్తుకునే విధంగా బోధిస్తూ ఆనతికాలములోనే విద్యార్థినీ విద్యార్థులకు ఇష్టమైన ఉపాధ్యాయునిగా పేరు తెచ్చుకున్నాడు అదేవిధంగా జానపద గేయాలు పాడుతూ ఒక జానపద కళాకారునిగా కూడా సేవలందిస్తూ అందరి గుండెల్లో నిలిచిపోయాడు మరియు పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో నైతిక విలువలు మానవతా సంబంధాల పట్ల అవగాహన కల్పిస్తూ  పిల్లలను మోటివేట్ చేస్తూ ఒక మంచి మోటివేటర్ గా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది…. అందుకుగాను  ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ తెలంగాణ తెలుగు కీర్తి కిరీటాలు వారు గుర్తించి    13-09-2025న హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో వారు అవార్డులు ప్రధానం చేయడం జరిగింది ఈ అవార్డు పట్ల నర్సింగాపూర్ గ్రామ ప్రజలు మరియు ధర్మారం మండల ప్రజలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు  మరియు అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం అభినందించడం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe