గ్రామీణ యువ పరిశోధకుడికి ఉత్తమ ప్రతిభా పురస్కారం అవార్డు

గ్రామీణ యువ పరిశోధకుడికి ఉత్తమ ప్రతిభా పురస్కారం అవార్డు.

అగ్రికల్చర్ ఎమ్మెస్సీ లో గోల్డ్ మేడల్ సాధించిన యువ పరిశోధకుడు సిహెచ్.నిఖిల్ రెడ్డి.

ఉత్తమ ప్రతిభ పురస్కారం అవార్డు అదజేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.

హార్ష్యం వ్యక్తం చేస్తున్న శాఖ ఉద్యోగులు,రైతులు.

అభినందలు తెలిపిన మండల వ్యవసాయ శాఖ అధికారి నిశాంత్ కుమార్.

BB6 TELUGU NEWS CHANNEL
ఫరూక్ నగర్,
“ఉత్తమ ప్రతిభా పురస్కారం” అవార్డు అంటే ఇది కేవలం అవార్డు కాదు,ఉత్తమ సేవలకు,ఒక నిర్దిష్ట రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ఇచ్చే గౌరవ ప్రదమైన బహుమతి,అలాంటి కోవలోకి వస్తాడు ఫరూక్ నగర్(గతంలో)మండల వ్యవసాయ శాఖ కార్యాలయం బూర్గుల క్లస్టర్ లో అగ్రికల్చర్(ఏఈవో)విధులు నిర్వహించిన సి.హెచ్.నిఖిల్ రెడ్డి…ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన గ్రామీణ రైతు బిడ్డ,యువ పరిశోధకుడు అగ్రికల్చర్(ఏఈవో)సి.హెచ్.నిఖిల్ రెడ్డిని ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ (M.Sc in Agriculture)లో గోల్డ్ మెడల్స్ సాధించి గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలిచారు.ఒకవైపు ఉద్యోగం మరోవైపు ఉన్నత దిగుబడినిచ్చే విత్తనాల అభివృద్ధి లక్ష్యంగా ఆమె పరిశోధనలు కొనసాగిస్తున్నారు..ప్రస్తుతం కేశంపేట క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు … 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా *”ఉత్తమ ప్రతిభ పురస్కరం”* అవార్డు తో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారని మండల వ్యవసాయ శాఖ అధికారి ఏవో నిశాంత్ కుమార్ తెలిపారు…గ్రామాల్లో ఉండే రైతన్నలకు కచ్చితమైన అవగాహనా కల్పించి,వారికి వ్యవసాయంలో మరిన్ని మెలకువలు నేర్పించి,మరింతగా అభివృద్ధి చెందేలా చేయడమే అంటూ బాధ్యతలు నిర్వహిస్తు పనిచేస్తున్నారు యువ అగ్రికల్చర్(ఏఈవో)సి.హెచ్.నిఖిల్ రెడ్డి… రైతు శిక్షణ,కీలక ఉత్పత్తులు,ఉద్దేశిత నైపుణ్య అంశాలపై చేస్తున్న సేవలను గుర్తించినందుకు గాను ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసిందన్నారు.

*మున్ముందు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.*

ఈ సందర్బంగా మండల వ్యవసాయ శాఖ అధికారి నిశాంత్ కుమార్ మాట్లాడుతూ,,రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు,వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో రైతుల ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్న నిఖిల్ రెడ్డికి ఉత్తమ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.పంటల కోసం పరిశోధనలు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ఫరూక్ నగర్ మండల వ్యవసాయ శాఖ అధికారి నిశాంత్ కుమార్ ఆకాంక్షిస్తూ,అభినందిస్తున్నారు…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe