తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న గండీడ్ ఎమ్మార్వో బి మల్లికార్జునరావు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ ఎంఆర్ఓ
బ్రహ్మరౌతు మల్లికార్జునరావు తండ్రి బి.సత్యనారాయణరావు స్వస్థల సంగారెడ్డి.జనవరి 27 2026 రోజున వెన్నచెడ్ గ్రామంలో నిర్వహించిన నో డ్రగ్స్ అవేర్నెస్, 2500 మీటర్ల నేషనల్ ఫ్లాగ్ ర్యాలీ, 77 వేషధారణలో పిల్లలు, 77 వ గణతంత్ర దినోత్సవం, 77 బైక్ ర్యాలీ, కార్యక్రమంలో చురుకుగా పాల్గొని పిల్లలను ప్రజలను చైతన్యవంతం చేయడానికి తనదైన శైలిలో మోటివేషన్ నిర్వహించారు. ఈ భారీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.బుధవారం మహబూబ్నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిప్రియ గారి చేతులు మీదుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం గండీడ్ ఎమ్మార్వోగా బాధ్యతలు నిర్వహిస్తున్న బ్రహ్మరౌతూ మల్లికార్జునరావు ప్రస్థానం ఎలా మొదలైంది అంటే..? జననం 22.7.1965 బి.ఎస్.సి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి. 1985 సంవత్సరంలో సంగారెడ్డిలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులయ్యానరు. తరువాత సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందారు. మండల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మరియు డిప్యూటీ తహసిల్దార్ ఆ తర్వాత 2015 సంవత్సరంలో తహసిల్దార్‌గా పదోన్నతి పొందారు. 41 అప్రిసియేషన్ అవార్డులు అందుకున్నారు. తహసిల్దారుగా జహీరాబాద్, చేగుంట, శివంపేట, పాపన్నపేట, మెదక్ జిల్లా. తిరిగి కోడైర్, నవాబ్ పేట్, నారాయణపేట, ప్రస్తుతం గండీడ్ తహసిల్దారుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వనస్థలిపురం సభ్యుడు గాండ్ల గిరిజపతి ,BB6 తెలుగు న్యూస్ ఛానల్ అధినేత గూడెం మధు గౌడ్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఆర్ ఐ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రమేష్ గారు పాల్గొన్నారు.

అడిషనల్ కలెక్టర్ హరిప్రియ గారికి బొకేతో సత్కరించిన ఎమ్మార్వో
గాండ్ల గిరిజాపతి లైన్స్ క్లబ్ ఆఫ్ వనస్థలిపురం
BB6 తెలుగు న్యూస్ ఛానల్ అధినేత గూడెం మధు గౌడ్
అవార్డును పరిశీలిస్తున్న అడిషనల్ కలెక్టర్ హరిప్రియ
అడిషనల్ కలెక్టర్ హరిప్రియ గారిచే అవార్డు అందుకున్న ఎమ్మార్వో మల్లికార్జునరావు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe