BB6 TELUGU NEWS CHANNEL
పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లును ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీ (TUFIDC)కి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు.
అనంతరం నిందితుడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.32.31 లక్షల లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు చట్టబద్ధ ఆదాయానికి సంబంధించిన ఆధారాలు చూపలేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఏసీబీ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
