BB6 TELUGU NEWS CHANNEL
రిపోర్టర్: వెంకటస్వామి పెద్దపల్లి జిల్లా ఇంచార్జి…..
పెద్దపెల్లి జిల్లా ఆరోగ్యాధికారుల ఆదేశానుసారం బుధవారం మధ్యాహ్నం టీబి, క్షయ వ్యాధిపై రూప్ నారాయణపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల ఆరోగ్య అధికారి సిహెచ్ రమేష్ ఎంపీహెచ్ఇపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రోగులు క్రమం తప్పకుండా మందులు వాడాలని పౌష్టికాహారాన్ని భుజించాలన్నారు. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే అంటువ్యాధి అని టీబి ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు,ఉమ్మినప్పుడు వెలువడే చిన్న గాలి బిందువుల ద్వారా బ్యాక్టీరియా ఇతరులకు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. రోగ నిరోధక శక్తి లోపించిన వారికి, చిన్నపిల్లలకు,వృద్ధులకు ఎక్కువగా ఈ క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. పొగ తాగడం, మధ్యపానం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. క్రమం తప్పకుండా దగ్గు రెండు వారాలపాటు మించి ఉన్నట్లయితే గ్రామంలో గల ఏఎన్ఎం ను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాజేశ్వరి ఆశ వర్కర్ అరుణ తో పాటు ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచ్ బొంగోని రమా శ్రీనివాస్, వార్డు సభ్యులు ఈద మొగిలి, ఎర్ల శారద వెంకటస్వామి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రూపునారాయణ పేట లో టి. బి.అవగాహన సదస్సు
04
Feb