15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ

BB6 TELUGU NEWS CHANNEL
ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌కు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) చిన్నారెడ్డి రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

బిల్లులు మంజూరు చేయాలంటే భారీగా లంచం ఇవ్వాలని ఓ కాంట్రాక్టర్‌ను చిన్నారెడ్డి డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు ముందస్తు ప్రణాళికతో వల వేసి పట్టుకున్నారు.

ఈ ఘటన అనంతరం జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. చిన్నారెడ్డికి సంబంధించిన పలు కీలక పత్రాలను పరిశీలించడంతో పాటు, ఆయన ఆస్తులు, ఆదాయ వనరులు తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe