రూ.15 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధకశాఖ (ACB) అధికారులు ఉక్కుపాదం మోపారు. గూడూరు మండలంలోని అయోధ్యపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

ZPHS ప్రధానోపాధ్యాయుడు మరియు గూడూరు మండల విద్యాశాఖాధికారి (MEO)గా బాధ్యతలు నిర్వహిస్తున్న జె. రవికుమార్, అలాగే అదే పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మరియు ఇన్ఛార్జ్ క్లర్క్ గా ఉన్న జి.లో చంద్రమౌళి కలిసి ఒక ఫిర్యాదు దారుడి నుండి రూ. 15,000 లంచం డిమాండ్ చేశారు.

ఫిర్యాదుదారుడికి సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్స్కీమ్ (CPS) రిటైర్మెంట్ బెనిఫిట్ బిల్లులను సిద్ధం చేసి,వాటిని AGA కార్యాలయానికి పంపేందుకు వీరు లంచం కోరినట్లు సమాచారం.

ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధకశాఖ అధికారులు ఉచ్చుపన్నీ చర్య చేపట్టి, గూడూరు ZPHS పాఠశాల ఆవరణలో లంచం స్వీకరిస్తుండగా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అనంతరం అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe