లయన్స్ క్లబ్ హైదరాబాద్ – ఆల్ ఈజ్ వెల్ నూతన అధ్యక్షుడిగా లయన్ ఎన్. భాస్కర్ ప్రమాణ స్వీకారం

BB6 TELUGU NEWS CHANNEL
సేవా కార్యక్రమాల విస్తరణే లక్ష్యం – ‘వీ సర్వ్, వీ కేర్, వీ ఇంపాక్ట్’ నినాదంతో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం.

ఆల్ ఇస్ వెల్ నూతన కార్యవర్గం

విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, యువత అభివృద్ధితో పాటు మానవతా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని లయన్స్ క్లబ్ హైదరాబాద్-ఆల్ ఈజ్ వెల్ నూతన అధ్యక్షుడు లయన్ ఎన్. భాస్కర్ తెలిపారు.

కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అశోకుమార్ స్వైన్ ముఖ్య అతిథిగా హాజరై చార్టర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డా. డి. లింగారెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఇన్స్టలేషన్ ఆఫీసర్ లయన్ పి. మనోజ్ కుమార్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. పీడీజీ లయన్ ఎన్. మనోహర్ రెడ్డి ఇండక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించారు.

Related News

బెస్ట్ సర్వీస్ అవార్డు అందుకున్న లయన్ గిరిజపతి

2026-27 సంవత్సరానికి అధ్యక్షుడిగా లయన్ ఎన్. భాస్కర్ ,కార్యదర్శిగా లయన్ జి. గిరిజాపతి ,కోశాధికారిగా లయన్ ఎన్. అభిరామ్  బాధ్యతలు స్వీకరించారు.

లయన్ కె. జైపాల్ రెడ్డి, లయన్ కమలాకర్ ముత్యాల, లయన్ జి. మాధవి, లయన్ రాంబాబు, జోన్ చైర్ పర్సన్ లయన్ ఎన్జేవీఎస్ నందకిశోర్ తదితరులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ ‘సర్వీస్ బియాండ్ సెల్ఫ్’ స్ఫూర్తితో ‘వీ సర్వ్-వీ కేర్-వీ ఇంపాక్ట్’ నినాదంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. సమాజంలో అవసరమైన వర్గాలకు అండగా నిలుస్తూ క్లబ్ సేవలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు.

ఆల్ ఇస్ వెల్ లియో యువ క్లబ్ మెంబర్స్