BB6 TELUGU NEWS CHANNEL
నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్ మహిళా సంఘాల ఆర్థిక సాధికారత కోసం చేపట్టిన ఇందిరా మహిళా శక్తిపథకంలో భాగంగా కొనుగోలు చేసిన మరో 400 కొత్తబస్సులను మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. 2025 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి తొలి విడతలో 153 బస్సులను ప్రారంభించారు. వీటికి డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీనే సమకూర్చింది. జీతభత్యాలు పోనూ ఒక్కో బస్సుకు ఆర్టీసీ నెలకు రూ. 69,468 అద్దె చెల్లిస్తోంది. 153బస్సులకు నెలకు రూ. 1,06,28,604 చొప్పున ఏడాదికి రూ. 12,75,43,248 ఆదాయం వచ్చింది. బస్సుల కొనుగోలు, ఆర్టీసీ అద్దెకిచ్చి నడిపించడం విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో మరో 400బస్సుల కొనుగోలుకు అనుమతించింది. దీంతో ఆబస్సుల సంఖ్య 553కు చేరింది. కాగా, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మహిళా సంఘాల ద్వారా ఆబస్సులను కొనుగోలు చేయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ వీటిని అద్దెకు తీసుకునేందుకు అంగీకరించింది.
ఏటా రూ.244.08 కోట్ల ఆదాయం
ఆర్టీసీకి బస్సులను అద్దెకిచ్చిన జిల్లాల్లో నల్గొండ మొదటిస్థానంలో నిలిచింది. ఆ జిల్లాలో 32 బస్సులను ఆర్టీసీకి అద్దెకిచ్చారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా 28 బస్సులతో రెండో స్థానంలో ఉంది. అత్యల్పంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 5 బస్సులను మహిళా సంఘాలు కొనుగోలు చేసి అద్దెకిచ్చాయి. కాగా, ఈ 553బస్సులకు రూ. 199.08 కోట్లను మహిళా సంఘాలు పెట్టుబడి పెట్టగా.. వాటికి ప్రతినెల రూ.20.34 కోట్ల చొప్పున ఏటా రూ.244.08 కోట్ల ఆదాయం సమకూరనుంది. బస్సుల పెంపుతో మండలాలకు ఆర్టీసీ సేవలు విస్తరించనున్నాయి. రాష్ట్రంలో 640 మండలాలకు గాను 560 గ్రామీణ మండలాలు కాగా..దాదాపు 7 మినహా అన్ని మండల సమాఖ్యలకు బస్సులు సమకూరాయి.
ఈ బస్సులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు:
• ఈ బస్సుల స్వభావం: ఈ బస్సులను మండల మహిళా సమాఖ్యలు (MMS) కొనుగోలు చేశాయి. వీటిని టీజీఎస్సార్టీసీకి (TGSRTC) లీజు (అద్దె) ప్రాతిపదికన నడపడానికి అప్పగించారు.
• ఆదాయం: ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ. 69,468 చొప్పున ఆర్టీసీ ద్వారా మహిళా సంఘాలకు అద్దె అందుతుంది. దీనిద్వారా మహిళలు లబ్ధిదారులుగానే కాకుండా, బస్సుల యజమానులుగా ఎదుగుతున్నారు.
• మహిళా శక్తి పథకం: రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో ‘ఇందిరా మహిళా శక్తి’ (లేదా మహిళా శక్తి) పథకం కింద ఈ కార్యక్రమం అమలు చేయబడుతోంది.
• మహిళా శక్తి సభ: ఈ బస్సుల ప్రారంభోత్సవంతో పాటు పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో ‘మహిళా శక్తి సభ’ను ప్రభుత్వం నిర్వహించింది.m
మరిన్ని వివరాలు, తాజా సమాaచారం కోసం BB6 TELUGU NEWS వార్తా కథనాలను పరిశీలించవచ్చు.
మహిళా సంఘాలకు. మరో 553 బస్సులు.ఈ రోజు (జూన్9) పరేడ్ గ్రౌండ్ లో మహిళా శక్తి సభ
09
Jun