షాపూర్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

BB6 TELUGU NEWS CHANNEL
షాపూర్‌నగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ* వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాయకత్వం పాల్గొన్నారు..

ఈ సందర్భంగా *యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్* మరియు *జిల్లా కార్యదర్శి భాగ్యరి వెంకటేష్* మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు.

నేడు దేశంలో విద్య, వైద్యం, ఉపాధి రంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చకుండా ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్వాతంత్ర్యం యొక్క నిజమైన స్ఫూర్తిని కాపాడాలంటే నిరుద్యోగం, అవినీతి, అసమానతలపై ప్రతి ఒక్కరూ పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.