అయ్యవారి లక్ష్మమ్మ మరణం 100 సంవత్సరాల మృతురాలి అంతక్రియలకు ఆర్థిక సహాయం అందజేసిన హస్త ఫౌండేషన్

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండిడ్ మండలం వెన్నాచేడ్  గ్రామానికి చెందిన అయ్యవారి లక్ష్మమ్మ  ( వయస్సు 100 సంవత్సరాలు. మరణ వార్త విషయం తెలుసుకొని  నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు హస్తపౌండేషన్  ముందుకు వచ్చింది. వెన్నాచేడ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హస్త ఫౌండేషన్ ను గత కొద్ది రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది. ఈమరణ వార్త తెలియగానే లక్ష్మమ్మ కుటుంబానికి  హస్త ఫౌండేషన్ సభ్యుల ద్వారా సమకూర్చిన 5000/- ఐదు వేల రూపాయలు అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ పౌండేషన్ ప్రధాన ఉద్దేశం నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం.