•ముంబైలో 20% హోటళ్లు,రెస్టారెంట్లు మూత.. బెంగళూరు, చెన్నై,హైదరాబాదులో ను అదే పరిస్థితి
•రంగంలోకి దిగిన కేంద్రం.. ఆయిల్స్ కపెనీలపై ఎస్మా ప్రయోగం పెట్రోల్, డీజిల్, గ్యాస్కు కృత్రిమ కొరత సృష్టించకుండా నిర్ణయం
•గృహ వినియోగదారులకు ఎల్పీజీ,వాహనాలకు సీఎన్జీ.. 100% పంపిణీ చేయాలని ఆదేశం
•ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ప్రత్యేక కమిటీ కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ అత్యవసర సమావేశం
•ఎల్పీజీ నిల్వలు, సరఫరాపై రివ్యూ..యుద్ధంతో కలిగే అంతరాయాలపై డిస్కషన్!
•ఎల్పీజీ కొరతలేదు.. ఉత్పత్తి 10శాతం పెరిగింది: కేంద్ర ప్రభుత్వ వర్గాలు
BB6 TELUGU NEWS CHANNEL
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో భారత్‌లో ఇంధన కొరత నెలకొన్నది. హార్మూజ్ జలసంధి నుంచి ముడి చమురు నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో దేశంలోని ప్రధాననగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. బెంగళూరు, చెన్నె,ముంబైల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే స్థితికి వచ్చాయి. దీంతో ఆయా అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేయడంతో, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వెంటనే ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆయిల్ రిఫైనరీలను ఆదేశించింది. అలాగే, దేశీయ ఇంధన అవసరాలకు ఇబ్బంది కలగకుండా కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ), సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరాను క్రమబద్ధీకరించేందుకు చమురు కంపెనీలపై ‘ఎసెన్షియల్ సర్వీసెస్ మేయింటెనెన్స్ యాక్ట్’ (ఎస్మా)ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గృహ అవసరాలు, రవాణా రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ, గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గత ఆరు నెలల సగటు వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని సరఫరాను నిర్ణయించారు. గృహ వినియోగం, రవాణా రంగానికి ఎలాంటి కోత లేకుండా
పూర్తిస్థాయిలో (100శాతం) గ్యాస్ అందించాలి. జాతీయ గ్యాస్ గ్రిడ్ పరిధిలోని పరిశ్రమలు, ఇతర తయారీ యూనిట్లు, పారిశ్రామిక వినియోగదారులకు గత 6 నెలల సగటు సరఫరాలో 80 శాతం అందేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ రంగానికి కీలకమైన ఎరువుల కర్మాగారాలకు 70శాతం కోటాను కేటాయించాలి. ఆయిల్ రిఫైనరీలకు ఇచ్చే గ్యాస్ కేటాయింపులకు 65 శాతానికి తగ్గించి, ఆ మిగులును ప్రజల అవసరాలకు మళ్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు..గ్యాస్ కొరతను సాకుగా చూపి అక్రమ నిల్వలు చేసే వారిపై, బ్లాక్ మార్కెటింగ్ పై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉత్పత్తి,దిగుమతులు, నిల్వలు, కేటాయింపు, సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించాలని ప్రతి ఉత్పత్తిదారుడు, దిగుమతిదారుడు, రవాణాదారుడు,పంపిణీ దాడులను ఆదేశించింది. దేశీయ అవసరాల కోసం ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్టస్థాయికి పెంచాలని రిఫైనరీలకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అదనపు ఉత్పత్తిని కేవలం గృహ అవసరాలకే మళ్లించాలని స్పష్టం చేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమల
వినతులను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
అవసరమున్న వారికి మాత్రమే మెరిట్ ఆధారంగా గ్యాస్ పంపిణీ చేస్తారు.
భౌగోళిక రాజకీయ పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ, ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేస్తున్నామని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)తెలిపింది. కమర్షియల్ సరఫరాపై ఈకమిటీ నిర్ణయమే అంతిమమని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కాగా, సోమవారం కేంద్రం వినియోగదారులకు 25 రోజుల ఇంటర్- బుకింగ్ పీరియడ్ ను ప్రవేశపెట్టింది. అంటే, ఒక సిలిండర్ బుక్ చేసిన 25 రోజుల తర్వాతే తదుపరిబుకింగ్కు అవకాశం ఉంటుంది.ఇంతకు ముందు ఇది 21 రోజులుగా ఉండేది.
ప్రధాని మోదీ కీలక సమావేశం ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దేశాల మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్ననేపథ్యంలో, భారత్లో నెలకొన్న ఎల్పీజీ కొరతపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.పశ్చిమాసియా యుద్ధం కారణంగా సామాన్య వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది.పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలీ పీజీ నిల్వలు, సరఫరాపై రివ్యూ చేశారు. అలాగే యుద్ధంతో ఉత్పన్నమయ్యే అంతరాయాలపై డిస్కస్ చేశారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా,ఇరాన్ ఆంక్షలతో ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడి అయిన హార్మూజ్,జలసంధి నుంచి నౌకల రవాణాకు
అంతరాయం ఏర్పడింది. దీంతో పెట్రోల్,డీజిల్, గ్యాస్ కు కృత్రిమ కొరత కలగకుండా కేంద్రం నిత్యావసర సరుకుల చట్టాన్ని ప్రయోగించింది. బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను నియంత్రించేందుకు పెట్రోలియం శాఖ ఈనిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న నిల్వలను పొదుపుగా వాడాలని
నిర్ణయించింది.
గ్యాస్ లేక మూతపడుతున్న హోటళ్లు..దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం ప్రకటనలు చేస్తున్నా..వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు,రెస్టారెంట్లు మూత పడుతున్నాయి.ముంబైలో ఇప్పటికే 20 శాతం హోటళ్లు,రెస్టారెంట్లను మూసివేసినట్టు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది. దాదర్, అంధేరి,మటుంగా లాంటి ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు గ్యాస్ ఆదా చేయడానికి ఎక్కువ సమయం పట్టే దాల్ మఖానీ, రవ్వదోశలాంటి వంటకాలను మెనూ నుంచి తొలగించాయి. పని వేళలను కూడా తగ్గించుకున్నాయి. బెంగళూరు,చెన్నైలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి నగరంలో హోటల్స్ కార్యకలాపాలకు నిలిచిపోయే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. గతంలో చమురు సంస్థలు 70 రోజుల పాటు నిరంతర సరఫరా చేస్తామని హామీ ఇచ్చి,ఇప్పుడు ఆపేయడం తమకు పెద్ద దెబ్బ అని పేర్కొన్నది. ఇక చెన్నె హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రవి గ్యాస్ కోరతపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని వివరించారు. ఆసుపత్రులు,ఐటీ పార్కులు, కాలేజీ హాస్టళ్లు, రైలు ప్రయాణికులకు సకాలంలో ఆహారం అందాలంటే గ్యాస్ సరఫరా తప్పని సరిఅని, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీపింగ్ పురికి ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ఎల్పీజీ కొరత తీరింది.. ప్రభుత్వవర్గాల ప్రకటన దేశంలో ఎల్పీజీ కొరత లేదని,సరఫరాను పునరుద్ధరించామని కేంద్ర ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా దేశంలో పలు హోటళ్లు, రెస్టారంట్లు మూతపడినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలమేరకు రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని 10%మేర పెంచాయని పేర్కొన్నది. కృత్రిమ కొరతను నిరోధించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎల్పీజీ సరఫరా విషయంలో సమస్యలను అర్థం చేసుకునేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు వివిధ రెస్టారెంట్ అసోసియేషన్లతో మాట్లాడుతున్నాయని,ఇందు కోసం ఐఓసీ, హెచ్పీసీఎల్,బీపీసీఎల్కు చెందిన ఈడీలతో ఓ కమిటీ
“గతంలో ఇతర దేశాల మార్గాల ద్వారా55% గ్యాస్ తెచ్చుకోగా, ఇప్పుడా కోటాను70 శాతానికి పెంచాం. మనముడిచమురు దిగుమతుల్లో 70% హార్మూజ్ జలసంధి నుంచి కాకుండా ఇతర వనరుల నుంచి సమకూరుతున్నాయి. రష్యా నుంచి కొనుగోళ్లు నిరంతరాయంగా సాగుతున్నాయి. గత నెలలో రోజూ 1.04 మిలియన్ బారెల్స్ చమురును కొనుగోలు చేశాం (ఇది మన మొత్తం అవసరాల్లో20%). ఇక సంక్షోభం తర్వాత ఇతరదేశాల కంటే మనమే మెరుగ్గా కోలుకుంటాం” అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.