BB6 TELUGU NEWS CHANNEL
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీసీల రాజ్యమే కావాలి..
బీసీల లెక్కలు తీసి బీసీల వాటా తేల్చకపోతే జన్ జీ ఉద్యమం ఇక్కడ కూడా మొదలవుతుంది…
ఓబిసి మహాసభ పోస్టర్ ఆవిష్కరణ లో దోమ వెంకటేష్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు
జ్ హెచ్చరిక…
ఆగస్టు 7న బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభ…
గండీడ్ మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో ఆగస్టు 7న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీలో జరగబోయే 11 జాతీయ ఓబిసి మహాసభ వాల్పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది .ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు దోమ వెంకటేష్ మాట్లాడుతూ మహాసభకు అన్ని రాష్ట్రాల నుండి ఓబీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని బీసీ కులగలను చేపట్టాలని జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని చట్టసభల్లో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు .జాతీయ మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు డీలిమిటేషన్ అంశాలను ముందుకు తీసుకురావాలని సూచిస్తుంది. ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై స్పష్టత లేకుండా అలాంటి బిల్లులను ఆమోదించకూడదని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా బిల్లు డీలిమిటేషన్ వల్ల బీసీలకు రాజకీయంగా ప్రయోజనం ఉండదని బీసీల ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకోకపోతే దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొమ్మిరి లక్ష్మయ్య, గిరమోని శ్రీనివాసులు, కొమిరెడ్డిపల్లి రాములు, గిరి మోని అంజయ్య, బంటు నర్సప్ప, బోయినీ గోపాలు, కొత్త గోపాలు, కొత్త నారాయణ, శంకరయ్య , చంద్రయ్య ,వెంకటయ్య ,మాజీ సర్పంచ్ హనుమంతు, వెంకటేశ్ ,యాదగిరి, రామకృష్ణ , కురుమయ్య , ఆంజనేయులు, సత్యనారాయణ, కొమ్మూరు నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
కాశీ నుండి కన్యాకుమారి వరకు బీసీలను ఏకం చేస్తాం బీసీ విద్యార్థి సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు దోమ వెంకటేష్
02
Aug