పాఠశాల విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు – ఇక నుంచి పది, ఇంటర్‌ విద్యకు ఒకటే బోర్డు, – తెలంగాణ రైజింగ్‌ దార్శనిక పత్రంలో కీలక ప్రతిపాదన

BB6 TELUGU NEWS CHANNEL

*🔊ఇకపై తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు*

*🔶ఇంటర్ బోర్డు ఇక కనుమరుగు!*

*🔷ఒకే గొడుగు కిందకు స్కూల్, ఇంటర్ విద్య*

*🔶న్యాయశాఖ పరిశీలనలో విలీన ముసాయిదా బిల్లు*

*🔷1971, 1982 నాటి పాత చట్టాల రద్దుకు రంగం సిద్ధం*

*🔷వచ్చే విద్యా సంవత్సరం నుంచి సరికొత్త వ్యవస్థ*

రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న విభిన్న పరిపాలనా విభాగాలకు ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యను ఏకీకృతం చేస్తూ అత్యంత కీలకమైన నిర్ణయాన్ని అమల్లోకి తెస్తోంది. ఇకపై ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి (ఇంటర్) వరకు అంతా ఒకే గొడుగు కింద కు రానుంది. ఇందుకోసం రూపొందించిన విలీన ముసాయిదా బిల్లు ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉంది. ఈ చారిత్రాత్మక సంస్కరణ 2027-28 విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ప్రస్తుతం పాఠ శాల విద్యకు తెలంగాణ విద్యా చట్టం (1982), ఇంటర్మీ డియట్ విద్యకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చట్టం (1971) అమల్లో ఉన్నాయి. ఈ రెండు పాత చట్టాలను రద్దు చేసి, నూతనంగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (టీ జీఎస్ఈబీ) ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి నట్లు సమాచారం. ఈ మేరకు పాఠశాల, ఇంటర్ విద్యా శాఖలు సంయుక్తంగా కసరత్తు పూర్తి చేసి ముసాయిదాను సిద్ధం చేశాయి. సిబ్బంది సర్వీసు నిబంధనలు, సీనియారిటీ తదితర అంశాల్లో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా న్యాయశాఖ దీనిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.*

*💥స్వయం ప్రతిపత్తిపై చర్చ…*

*🛟ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు స్వయం ప్రతిపత్తితో (అటానమస్) వ్యవహరిస్తూ, సొంత నిధులతో నడుస్తోంది. కానీ, టెన్త్ క్లాస్ బోర్డు (ఎస్ఎస్ సీ) ప్రతి పైసా కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ రెండింటినీ విలీనం చేస్తే, ఇంటర్ బోర్డు వద్ద ఉన్న భారీ నిధుల పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఏర్పడే ఉమ్మడి బోర్డును కూడా స్వయం ప్రతిపత్తితో కొనసాగించాలా? లేక ప్రభుత్వ విభాగంగా మార్చాలా? అనే కోణంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.*

*💥స్కిల్స్ వర్సిటీకి పరిధిలోకి పాలిటెక్నిక్ కాలేజీలు*

*🥏కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా, సాంకేతిక విద్యలోనూ ప్రభుత్వం భారీ మార్పులు చేస్తోంది. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ, 53 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలను ఇకపై యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురానున్నారు. ఇప్పటివరకు ఈ కళాశాలల పర్యవేక్షణ, పరీక్షలు, సిలబస్ రూపకల్పనను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటెట్) చూస్తుం డగా, చట్ట సవరణ తర్వాత ఆ బాధ్యతలన్నీ స్కిల్స్ వర్సిటీకి బదిలీ కానున్నాయి. న్యాయశాఖ ఆమోదం లభించిన తర్వాత, ఈ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ముందు ఉంచుతారు. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టసభల ఆమోదం పొందుతారు. వచ్చే ఏడాదిలోగా ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసి, 2027-28 నాటికి రాష్ట్రంలో ఒకే బోర్డు, ఒకే విద్యా విధానం అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe