BB6 TELUGU NEWS CHANNEL కరీంనగర్ ల్లో సంచలనం సృష్టించిన జ్యువెలరీ షాపు దోపిడీ కేసుకు సంబంధించి పోలీసులు కీలక పురోగతి సాధించారు. కాల్పులు జరిపి నగదు, నగలతో పరారైన నిందితుల చిత్రాలను ఉన్నతాధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఈ ముఠా ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
కరీంనగర్ నగరంలో ఆదివారం పట్టపగలే జరిగిన భారీ దోపిడీ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక బంగారు దుకాణంలోకి చొరబడిన ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి భారీ మొత్తంలో నగలు, నగదు ఎత్తుకెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ సాహసోపేత దోపిడీని సీరియస్గా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల ఫోటోలను సేకరించి వాటిని బహిరంగ పరిచారు.
దొంగల ఫోటోలు రిలీజ్ చేసిన పోలీసులు
నిందితుల గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి లక్ష రూపాయల పారితోషికం ఇస్తామని పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. ఈ దొంగల చిత్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే చేరవేశారు. సోషల్ మీడియా వేదికగా, వాట్సాప్ గ్రూపుల ద్వారా సాధారణ పౌరులకు కూడా ఈఫోటోలను షేర్ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని ప్రజలను కోరారు.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరితో పాటు నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పరిధిలోని పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ప్రధాన రహదారులు, చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. దొంగలు ఇతర జిల్లాలకు లేదా పొరుగు రాష్ట్రాలకు పారిపోయే అవకాశం ఉన్నందున రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద నిఘా పెంచారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టారు.
సిసి ఫుటేజ్ దృశ్యాలు
ఈ కేసులో సమాచారం ఇవ్వదలచిన వారు డయల్ 100 లేదా కరీంనగర్ 2 టౌన్ ఇన్ స్పెక్టర్(8712670762), ఏసీపీ కరీంనగర్ టౌన్(8712670711), ఎస్బీ కంట్రోల్ కరీంనగర్(8712670713) నంబర్లకు ఫోన్ చేయవచ్చు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.దర్యాప్తుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని వారు విజ్ఞప్తి చేశారు. నిందితులు ఆయుధాలు కలిగి ఉన్నందున నేరుగా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడమే శ్రేయస్కరమని సూచించారు.
BB6 TELUGU NEWS CHANNEL రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో సత్తా చాటిన గండీడ్ చిన్నారి మోక్షిత..గ్రామీణ తెలంగాణ నుండి యువ క్రీడా ప్రతిభ క్రమంగా పెద్ద వేదికలపై తనదై...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్: రంగారెడ్డిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.కోస్గి మండలం, బుల్లోన్ పల్లి గ్రామానికి చెం...
BB6 TELUGU NEWS CHANNEL హైదరాబాద్ కూకట్పల్లి లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. JNTU పరిధిలో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపై కొట్టుకున్...
BB6 TELUGU NEWS CHANNEL యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య వివాదం ఘర్షణకు దారి తీసిం...
BB6 TELUGU NEWS CHANNEL ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత ఏకరూప దుస్తులను నేడు అధికారికంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార...
BB6 TELUGU NEWS CHANNEL వరంగల్ లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జీవో నంబర్ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న ని...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైందంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొన్ని మీడి...
BB6 TELUGU NEWS CHANNEL నమస్తే, వెల్కమ్ టు BB6 న్యూస్. హైదరాబాద్ లో వైద్యం పేరుతో సాగుతున్న పెద్ద దందా గుట్టురట్టైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డ...
BB6 TELUGU NEWS CHANNEL గండీడ్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గండిడ్ నందు మండల అధ్యక్షులు వి జనార్ధన్ గారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడ...
BB6 TELUGU News CHANNEL మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శ్రీ హనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన ఐదవ జాతీయ కరాటే, టైక్వాండో పోటీల్లో గండీడ్ మండల...