నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కె ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని చాపలగూడెం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన  బైండ్ల రాములు అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున మరణించడం జరిగింది ఈ విషయాన్ని కె ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి  దృష్టికి ఈ విషయాన్ని చాపలగూడెం గ్రామ మాజీ సర్పంచ్ గండి లక్ష్మయ్య తీసుకపోవడం తో తక్షణమే స్పందించి తాను అందుబాటులో లేకపోయినా కె ఎస్ ఆర్ ట్రస్ట్ సభ్యులతో మృతుని కుటుంబ సభ్యులకు  అంత్యక్రియల కొరకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో  సిద్దయ్య సత్తయ్య బైండ్ల బాలకృష్ణ రామచంద్రయ్య గోపాల్  మొగులయ్య బాబు మరియు చాపలగూడెం గ్రామం మాజీ సర్పంచ్ గండి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe