కొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన మహమ్మదాబాద్ పోలీసులు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గన్నేరు మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో మహిళ ఆచూకీ తెలియడం లేదని మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో బడపల అరుణ అనే మహిళ పెద్దల అమావాస్యనాడు అనగా ఆదివారం ఇంట్లో తన భర్తతో సంసారం విషయంలో గొడవలు పడగా ఆమె ఇంటి నుండి వెళ్లిపోయినది. ఈ విషయం అరుణ భర్త అయిన తిరుమలయ్య తన భార్య అయిన అరుణ యొక్క తల్లిదండ్రులకు చెప్పగా వారందరూ కలిసి చుట్టుపక్కల గ్రామాలలో బంధువుల దగ్గర ఆమె ఆచూకీ కోసం ఎంత వెతికినా దొరకలేదు. కావున బుధవారం అరుణ యొక్క తండ్రి పెద్ద బాలయ్య నివాసం అభంగపట్నం కోయిలకొండ మండలం మహమ్మదాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు .దరఖాస్తు మేరకు అరుణ కనిపించకుండా పోయిన విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe