కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆదిలాబాద్ జిల్లా నాయకులు..

BB6 TELUGU NEWS CHANNEL
ఘర్ వాపసి షురూ…
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఆదిలాబాద్ నాయకులు మంగళ వారం నాడు హైదరాబాద్ లో పలువురు ఆదిలాబాద్ జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఘర్ వాపసి షురూ…

ఆదిలాబాద్ మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ.మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంజీవరెడ్డి లు మంగళవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇటీవల టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో పార్టీని వీడిన  కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి కాంగ్రెస్ లో చేరాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు చేసిన ప్రతిపాదనను కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే..