అలేర్ లో లంచానికి చేయి చాపిన అధికారులు.. ఏసీబీ దాడిలో అడ్డంగా బుక్కైన RI, GPO

BB6 TELUGU NEWS CHANNEL
యాదాద్రి భువనగిరి జిల్లా అలేర్ మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.14 వేలు లంచం తీసుకుంటూ అలేర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేముగంటి పూర్ణచందర్ రావు, కొలనుపాక గ్రామ పాలనాధికారి షేక్ అహ్మద్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుడి సోదరి విక్రయించిన భూమి రిజిస్ట్రేషన్ కు సహకరించేలా తహసీల్దార్ కు నివేదిక పంపేందుకు ఇద్దరు కలిసి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ నల్గొండ రేంజ్ అధికారులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.