BB6 TELUGU NEWS CHANNEL
ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ACB Trapలో పట్టుబడితే విషయం తీవ్రమైనదే. అయితే ACB Trap జరిగిన వెంటనే ఉద్యోగం నుంచి తొలగించినట్లు కాదు. క్రిమినల్ కేసు ఒకవైపు, శాఖాపరమైన చర్యలు మరోవైపు కొనసాగుతాయి.*
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే Telangana Civil Services (Classification, Control & Appeal) Rules, 1991 ప్రకారం, ఉద్యోగిపై disciplinary proceedings pending లేదా contemplatedగా ఉన్నప్పుడు, లేదా criminal case investigation, inquiry లేదా trialలో ఉన్నప్పుడు Rule 8 కింద suspension విధించే అవకాశం ఉంటుంది.
అయితే suspensionను శిక్షగా చూడకూడదు. విచారణ జరుగుతున్న సమయంలో ఉద్యోగిని విధులకు దూరంగా ఉంచే తాత్కాలిక చర్య మాత్రమే. అలాగే ఉద్యోగి 48 గంటలకు మించి custodyలో ఉంటే Rule 8 ప్రకారం deemed suspension వర్తించే పరిస్థితి ఉంటుంది.
ACB కేసు నమోదైనంత మాత్రాన departmental proceedings ఆగిపోవు. Criminal caseలో నేరం రుజువైందా అనే అంశాన్ని కోర్టు పరిశీలిస్తుంది. Departmental proceedingsలో మాత్రం ఉద్యోగి service misconductకు పాల్పడ్డాడా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించాడా అనే అంశాన్ని శాఖ పరిశీలిస్తుంది.
శాఖాపరమైన విచారణలో ఆరోపణలు రుజువైతే CCA Rulesలోని Rule 9 ప్రకారం శిక్ష విధించే అవకాశం ఉంటుంది. శిక్ష స్వభావాన్ని బట్టి minor penalty నుంచి major penalty వరకు చర్యలు ఉండవచ్చు.
Major penalty విధించే సందర్భంలో Rule 20 ప్రకారం నిర్దేశిత departmental inquiry నిర్వహించాలి. Charge memo, chargesకు సంబంధించిన వివరాలు, defence సమర్పించే అవకాశం, evidence పరిశీలన, inquiry report వంటి prescribed procedureను పాటించాలి.
అందువల్ల ACB Trapలో పట్టుబడ్డ ఉద్యోగి విషయంలో “ఇక ఉద్యోగం పోయినట్టే” అని చెప్పడం సరైనది కాదు. అదే సమయంలో ACB Trapను సాధారణ విషయంగా కూడా చూడలేం. Criminal caseతో పాటు departmental proceedingsలో కూడా ఆరోపణలు రుజువైతే ఉద్యోగిపై తీవ్రమైన service consequences ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా..? BB6 న్యూస్ ద్వారా తెలుసుకుందామా.?
16
Aug