BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కొస్గి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రం వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కొస్గి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది.
“మొక్కలు నాటండి – పర్యావరణాన్ని రక్షించండి” అనే నినాదంతో, “ఈత మొక్కలు పెంచుదాం – గీత వృత్తిని కాపాడుదాం” అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కొస్గి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఖాళీ ప్రదేశాల్లో, చెరువు కట్టల వెంబడి వందలాది ఈత మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, స్థానిక రైతులు, గీత కార్మికులు,Janardan Goud,Jagan goud,Madhan Goud,Mahipal Goud,Surender Goud,Bhagavanth Goud,Basanna Goud,srinivas goud,Ramchendraiah Goud,Mogilaiah goud,Narsimha goud,Balraj Goud,పాల్గొన్నారు. ఈత మొక్కలు పెంపకం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒకటి పర్యావరణ పరిరక్షణ, రెండోది తెలంగాణ సంప్రదాయ వృత్తి అయిన గీత వృత్తిని కాపాడుకోవడం.
గత కొన్నేళ్లుగా ఈత చెట్లు తగ్గిపోవడంతో గీత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవనోపాధికి ఆధారమైన ఈత చెట్లను తిరిగి పెంచడం ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని, తెలంగాణను హరిత తెలంగాణగా మార్చడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
