TS WDCW : అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 6వ పత్రిక ప్రకటన విడుదల 18.07.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి

BB6 TELUGU NEWS CHANNEL
TS WDCW Anganwadi Requirement 2026 Anganwadi Teacher Notification 2026 Apply Now : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడి కేంద్రాలలో కొలువ భర్తీకి జిల్లాల వారీగా భర్తీ చేస్తున్నారు. 33 జిల్లాలలో 15,982 ఖాళీలు, అందులో 3100 టీచర్ పోస్టులు 12,882 సహాయక పోస్టులు జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆయా జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వారిగా ఖాళీలు గుర్తించి శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా, మహమ్మద్ నగర్ జిల్లా, జోగులాంబ గద్వాల్, నల్గొండ, ములుగు జిల్లాలలో ఇప్పటికు రిలీజ్ అయ్యాయి. ఈరోజు కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 178 అంగన్వాడి టీచర్ల కొలువులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనీనా గురువారం ఒక ప్రకటన తెలిపారు. అన్ని జిల్లాలలో అదే తరహాలో వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.
కొత్తగా కొత్తగూడెం జిల్లాలో 178 అంగనవాడి టీచర్ భర్తీకి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన, ఒకటి జూలై 2026 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల నుంచి ఉండకూడదు, స్థానికత కలిగిన మహిళా అభ్యర్థులు, దివాంగులు వినికిడి పరికరాల ఉపయోగించి వినగలిగే అభ్యర్థులు, ఆనందత్వం గల ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వహించే సామర్థ్యం, అంగవైకల్యం కలిగి ప్రాథమిక విద్య బోధన పిల్లలను సంరక్షణ గల మహిళ అభ్యర్థులను అర్హులని తెలిపారు. మరిన్ని వివరాల కోసం స్థానిక ఐసిడిస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ ఉద్యోగాలకు శుక్రవారం 03 జులై 2026 నుంచి ఈనెల జూలై 18 సాయంత్రం 5 వరకు అర్హత కలిగిన అభ్యర్థులు
https://mis.tgwdcw.in/
ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుదారులను ఈనెల 20 నుంచి ఆగస్టు ఏడో తేదీ వరకు పత్రాలు ద్వికరణ చేస్తామని తెలిపారు. అత్యధికంగా పాల్వంచ, అత్యల్పంగా చంద్రు గొండ ప్రాజెక్ట లో అంగన్వాడీ టీచర్ కొలువులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అంగన్వాడి టీచర్ రిజర్వేషన్ వివరాలు వెబ్సైట్లో ప్రాజెక్ట్ అధికారి వద్ద వివరాలు ఉన్నాయి.

జిల్లాల వారీగా ఐసిడిసి ప్రాజెక్టు వారీగా పోస్టుల ఖాళీ వివరాలు

అశ్వరావుపేట (11), చంద్రుగొండ (8), బూర్గంపాడు (10),దమ్మపేట (16), చర్ల (12), దుమ్ము గూడెం (12),మణుగూరు (24), కొత్తగూడెం (16), పాల్వంచ (29),టేకులపల్లి (19), ఇల్లెందు (21) తదితర ఐసిడి ప్రాజెక్టులో ఖాళీలు అయితే ఉన్నాయి మరిన్ని వివరాల కోసం క్రిందఇచ్చిన రోస్టర్ మరియు రిజర్వేషన్ చెక్ చేసి వెంటనే అప్లై చేసుకోండి.

అంగన్వాడి ఉద్యోగులకు అర్హత వివరాలు:

అంగన్వాడీ టీచర్ లేదా సహాయక పోస్టులు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉన్న అభ్యర్థులకు ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతై ఉండాలి. అంగన్వాడి సహాయక పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షాన 10వ తరగతి పాసైన అభ్యర్థులకు పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు.

వయసు : 01 జూలై 2026 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.

అంగనవాడి ఉద్యోగాలు ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియ మార్కులు వెయిటేజ్ గా ఆధారంగా ఉంటాయి. అందులో ఇంటర్ వచ్చిన మార్క్స్ కు 70%, వితంతువులకు 5%, అనాధలకు 10%, దివాంగులకు 5% వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకు 10%  ఉంటాయి. ఈ అంగన్వాడి ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ.. అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ ఈనెల 20వ తేదీ నుంచి ఆగస్టు 7 తేదీ వరకు పాత్రల ధ్రువీకరణ పరిశీలిస్తారు.

అంగన్వాడీ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన పత్రాలు వివరాలు

1. పుట్టిన తేదీ పత్రం లేదా వయసు ధ్రువీకరణ పత్రం 10th క్లాస్ సర్టిఫికెట్.

2. తహసిల్దార్ నుంచి కుల దృవీకరణ పత్రం

3. తహసిల్దార్ నుంచి నివాసతోవీకరణ పత్రం

4. ఇంటర్మీడియట్ విద్య అర్హత ధ్రువీకరణ పత్రం, ఆపై చదివిన విద్య అర్హత జాబితా

5. అంగవైకల్యం కలిగిన వారు సదన్ సర్టిఫికెట్

6. వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికెట్.. పై చెప్పిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా (Scanned Copies) రెడీగా చేసి పెట్టుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

•దరఖాస్తు ప్రారంభం తేదీ : 03 జూలై 2026

•దరఖాస్తు చివరి తేదీ : 18 జులై 2026 సాయంత్రం 5.00 గంటల వరకు

•ఈనెల 20 నుంచి ఆగస్టు 7 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవాలన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe