క్రాప్ బుకింగ్ లో కాకిలెక్కలు! రైతులు ఒక పంట వేస్తే మరో పంటగా నమోదు



క్రాప్ బుకింగ్ లో కాకిలెక్కలు! రైతులు ఒక పంట వేస్తే మరో పంటగా నమోదు


BB6 TELUGU NEWS CHANNEL
•సాగైన పంటలనూ నమోదు చేయడంలో ఏఈవోల నిర్లక్ష్యం

•ఎరువుల సప్లై, ధాన్యం, పత్తిసేకరణలో అంచనాలు తారుమారు

•పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు అన్నదాతలకు తిప్పలు

•ఈసారైనా క్రాప్ బుకింగ్ కచ్చితంగా జరిగేనా…?

తెలంగాణ రాష్ట్రంలో పంటలనమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియ తప్పులతడకగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో వ్యవసాయ శాఖ ఈక్రాప్ బుకింగ్ నిర్వహిస్తుంది. ఈ డేటా ఆధారంగానే ప్రభుత్వం ఆయా సీజన్లలో విత్తనాలు,
ఎరువులు సిద్ధం చేయడంతో పాటు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లు చేపడుతుంది. రైతులు వేసిన పంటలకు అవసరమైన ఎరువులు సమకూర్చుకోవాలన్నా, బ్యాంకుల్లో క్రాప్ లోన్లు పొందాలన్నా, పండించిన పంటను అమ్ముకోవాలన్నా ఈ డేటానే కీలకంగా మారుతుంది. కానీ కొంతమంది ఏఈవోలు తూతూమంత్రంగా క్రాప్ బుకింగ్ నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఫీల్డ్ కు వెళ్లి రైతులుఏ పంట వేశారో చూడకుండా ఆఫీసుల్లో కూర్చుని కాకిలెక్కలు సమర్పిస్తున్నారు.రైతులు ఒక పంట వేస్తే ఏఈవోలు మరో పంటను నమోదు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ క్రాప్
సర్వే(డీసీఎస్) కూడా లోపభూయిష్టంగా సాగుతోంది. దీంతో పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలను అగచాట్లు పెడుతోంది. మళ్లీ వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈసారైనా కచ్చితమైన సమాచారంతో క్రాప్ బుకింగ్ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe