గండీడ్ మండల కేంద్రం రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ….

తక్కువ యూరియా వాడి సాగు ఖర్చును తగ్గించండి

రైతులకు శాస్త్రవేత్తలు శశిభూషణ్,అసిస్టెంట్ ప్రొఫెసర్ చరణ్ తేజ్ అవగాహన

గండీడ్ లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

Related News

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రైతు శాస్త్రవేత్తలు శశిభూషణ్, అసిస్టెంట్ ప్రొ॥ చరణ్ తేజ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం, రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేయాలని మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలు అయిన సన్న రకాలైన ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటి 1638 వంటి రకాలను వేసుకోవాలని అలాగే దొడ్డుగింజ రకాలైన ఎంటియు 1010, కేఎన్ఎమ్ 118 వంటి రకాలను వేసుకోవాలని చెప్పారు. ప్రతి పంటలో రైతులు పాటించాల్సిన మెలకువలు, పెట్టుబడి తగ్గించి అధిక దిగుబడి పొందే అంశాల గురించి చెప్పారు. సేంద్రియ వ్యవసాయం జీవన ఎరువుల వాడకం మరియు చౌడు భూములు యాజమాన్య గురించి అలాగే రసాయన మందులు పిచికారి చేసుకొనుట, తీసుకోవాల్సిన జాగ్ర”తల గురించి వివరించారు. పంటలలో చీడపీడల నివారణ ఎరువుల సమతుల్య వినియోగం వాతావరణాల వ్యవసాయ పద్ధతులపై రైతులకు సూచనలు చేశారు. రైతుల అడిగిన పలు సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు ఇచ్చి ఆధునిక సాగు విధానాలను వివరించారు. ఏఓ మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే, దిగుబడులు పెరిగి ఆర్థికంగా లాభ పడతారని తెలిపారు.

అనంతరం గండీడ్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన అనంతలక్ష్మారెడ్డి మాట్లాడుతూ భూసార పరీక్షలు కచ్చితంగా తీసుకోవాలని కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడొద్దని, ఎరువుల వాడకాన్ని అవసరానికి మరి మించి వాడొద్దని, ఇలాంటి అవగాహన సదస్సులు ఎక్కువ మొత్తంలో గ్రామాలలో చేసి ప్రతి ఒక రైతు పంట మార్పిడి కచ్చితంగా పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో గండీడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి ,గ్రామ సర్పంచ్ ర్యాగరి భగవంతు రెడ్డి,PACS చైర్మన్ లక్ష్మీనారాయణ, శాస్త్రవేత్తలు శశిభూషణ్,అసిస్టెంట్ ప్రొఫెసర్ చరణ్, సేంద్రియ రైతులు,ఏఓ రాధ ,నరసింహారావు ఇతర గ్రామాల సర్పంచులు, 70 మంది రైతులు పాల్గొన్నారు.