రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ  : ఉగాది పండగ వేళ రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2026, మార్చి 22న ఈసీజన్ రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపింది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డితొలి విడత నిధులను విడుదలచేయనున్నారు. తొలి విడతలో భాగంగా ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖతాల్లో నిధులు జమ చేయనున్నారు.

ఫస్ట్ ఫేజ్లో రూ.3,590 కోట్ల నిధులు విడుదల చేయనుండగా 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. తొలి విడత నిధులు విడుదల చేసిన 20 రోజుల తర్వాత సెకండ్ ఫేజ్ నిధులు రిలీజ్చేయనున్నారు. రెండో విడతలో భాగంగారూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ వేయనున్నారు.

ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు విడుదల చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో రూ.9 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. కాగా, రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ప్రభుత్వం రైతులకు ఆర్ధిక సహయం చేస్తోన్న విషయం తెలిసిందే.పంట పెట్టుబడి సహయం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తోంది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe