కరోనా కంటే దారుణంగా ఉంటుంది Al ( ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ) ఐటీ ఉద్యోగులకు చుక్కలు కనిపిస్తాయంట..!

BB6 TELUGU NEWS CHANNEL
ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AI గురించే మాట్లాడుకుంటున్నారు.. కారణం ప్రపంచవ్యాప్తంగా ఏఐ సృష్టించే విప్లవం అలా ఉంది మరి.. గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు టైప్ మెషీన్లు కనుమరుగు అయ్యాయి.. కంప్యూటర్ టెక్నాలజీతో కోట్ల ఉద్యోగాలు వచ్చాయి.. ఇప్పుడు ఆటెక్నాలజీయే ఉద్యోగాలను చంపేస్తుందంట.. అవును.. AI..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ఎలా ఉంటుంది అంటే.. కరోనా కంటే దారుణంగా.. కరోనా కంటే ఘోరంగా ఉండబోతుంది అంట.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. AI సృష్టికర్తల్లో ఒకరు అయిన మాట్ షుమెర్. ఇతను ఎవరో కాదు AI సహ వ్యవస్థాపకుడు..ఇతను రాసిన ఆర్టికల్ ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని వణికిస్తోంది.

BB6 TELUGU NEWS CHANNEL
కోవిడ్ మహమ్మారి కంటే AI (కృత్రిమ మేధస్సు) వల్ల వచ్చే మార్పులు చాలా తీవ్రంగా ఉంటాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోవిడ్ వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇంకా ‘హైబ్రిడ్’ పద్ధతులకు మారిపోయాయి. దీనివల్ల ఆఫీస్ బిల్డింగ్లకు డిమాండ్ తగ్గింది.ఇప్పుడు AI రాకతో ఈ పరిస్థితి మరింత దిగజారుతుందని పెట్టుబడిదారులు భయపడుతున్నారు.

ఉద్యోగాల కోత

‘అదర్ సైడ్ AI’ సంస్థ సీఈఓ మాట్షుమెర్ రాసిన ఓ ఆర్టికల్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఎంట్రీ లెవల్ ఆఫీస్ ఉద్యోగాలను AI పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రభావం కోవిడ్ కంటే భయంకరంగా ఉంటుంది. కేవలం24 గంటల్లోనే అయన రాసిన ఆర్టికల్ 3కోట్ల మంది చూడటం, ప్రజల్లో ఉన్న ఆందోళనకు నిదర్శనం. ఎలోన్ మస్క్ ఏమంటున్నారంటే ప్రముఖ టెక్ దిగ్గజం ఎలోన్ మస్క్ కూడా ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆఫీసుల్లో మనుషుల కంటే AI సిస్టమ్స్, రోబోలే ఎక్కువగా ఉంటాయని ఆయన సూచించారు. మానవ శ్రమపై ఆధారపడే కంపెనీలకంటే, AIని వాడుకునే కంపెనీలే వేగంగా ఎదుగుతాయన్నారు. పూర్వ కాలంలో “కంప్యూటర్” అంటే లెక్కలు చేసే మనిషి అని అర్థం. పెద్ద పెద్ద బిల్డింగ్ నిండా మనుషులు కూర్చుని లెక్కలు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక చిన్న ల్యాప్టాప్లోని ‘స్ప్రెడ్లైట్’ ఆ బిల్డింగ్ అంత మంది చేసే పనిని సెకన్లలో చేస్తోంది. అదే విధంగా, భవిష్యత్తులో వైట్-కాలర్ ఉద్యోగాలన్నీ సాఫ్ట్ వేర్ మయం అయిపోతాయని ఎలోన్ మస్క్ హెచ్చరించారు. మొత్తానికి చూస్తే AI వల్ల ఆఫీసుల్లో మనుషుల అవసరం తగ్గిపోతుందని, దీనివల్ల అటు ఉద్యోగ మార్కెట్, ఇటు కమర్షియల్ రియల్ఎస్టేట్ రంగం భారీగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe