BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ : వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. వర్షాలతో పాటు వడగండ్లు,40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్‌లో ను పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈనేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎత్తయిన ప్రదేశాల్లో ఉండకూడదని, పాత షెడ్లలో, గోడల పక్కన నిలబడరాదని ఎక్స్పర్ట్స్ సుచిస్తున్నారు.
తగ్గుముఖం పట్టిన ఎండలు..
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నమొన్నటి వరకు 45 నుంచి 46 డిగ్రీల దాకా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు.. బుధవారం 43 కన్నా తక్కువకు దిగివచ్చాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలలోపే టెంపరేచర్లు నమోదయ్యాయి. కాగా, ఈ ఉపశమనం వచ్చే ఐదు రోజుల పాటే ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ఐదు జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోప్రాలో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయింది.
ఆదిలాబాద్ జిల్లా రజ్లో 42.6, భద్రాద్రికొత్తగూడెం జిల్లా బయ్యారంలో 42.4, జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 42.3, ఖమ్మంజిల్లా ఎన్కూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా నమోదుకాగా.. 19 జిల్లాల్లో40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 40డిగ్రీలలోపే రికార్డయ్యాయి. ఇటు హైదరాబాద్ సిటీలోనూ టెంపరేచర్లు
దిగివచ్చాయి. అంబర్ పేట, మెహిదీపట్నం,
సికింద్రాబాద్ సర్కిళ్లు మినహా మిగతా 27
సర్కిళ్లలోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే రికార్డయ్యాయి. అత్యధికంగా అంబర్పేటలో 40.5 డిగ్రీలు, మెహిదీపట్నంలో40.2, సికింద్రాబాద్లో 40.1 డిగ్రీల మేర నమోదయ్యాయి. మరో ఐదు రోజులు టెంపరేచర్లు ఇలాగే నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
భానుడి భగభగలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ లేటెస్ట్ అలర్ట్
07
May