ఎండల తీవ్రతకు వడదెబ్బతో వ్యక్తి మృతి

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలం, కప్లాపూర్ గ్రామానికి చెందిన సైదనోళ్ల సాయన్న వడదెబ్బతో మృతి చెందారు. గత వారం రోజులు పొలం పనులు చేసిన సాయన్న వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై, ఆసుపత్రికి చేరేలోపు మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా పెరిగిన ఎండల తీవ్రతతో మహబూబ్ నగర్ జిల్లాలో కూడా తీవ్ర ఆందోళన మొదలైంది. రైతులకు ఎండ తీవ్రతపై అధికారులు పలు సూచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe