BB6 TELUGU NEWS CHANNEL
ఎబోలా వైరస్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిగురించే చర్చ.. కరోనా వైరస్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఎబోలా..ఇది ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండా వంటి దేశాల్లో జనం పిట్టల్లారాలి పోతున్నారు. ఈ వైరస్ ప్రపంచదేశాలకు వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ కూడా లేదు. ఇలాంటి టైంలో రష్యా గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బండిబుగ్యో ఎబోలా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ప్రకటించింది.

కాంగో, ఉగాండాలలో బుండి బుగ్యోఎబోలా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో అంతర్జాతీయ ఆందోళన మధ్య బండిబుగ్యో ఎబోలా వైరస్ రకాన్ని అదుపు చేసేందుకు టీకాను తమ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో తెలిపారు. మధ్య ఆఫ్రికాలో వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన తర్వాత రష్యా ఈ ప్రకటన చేసింది. WHO అంచనా ప్రకారం.. వైరస్సోకిన సగం మంది చనిపోతున్నారు. కొత్త కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి.
ఎబోలా వ్యాక్సిన్ పై రష్యా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నప్పటికీ ఆవ్యాక్సిన్ వినియోగం సురక్షితమైనదేనా,ఎబోలా వైరస్ పై ప్రభావం చూపుతుందా అని తెలుసుకునేందుకు క్లినికల్ ట్రయల్స్నుంచి డేటా, పీర్ రివ్యూడ్, నియంత్రణ సమీక్ష వంటివి చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.రష్యా వ్యాక్సిన్ ప్రకటన..రష్యన్ శాస్త్రవేత్తలు కొత్త ఎబోలా స్ట్రెయిన్ ను లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్ను విజయవంతంగా కనుగొన్నారని, దీనికి సంబంధించి వివరాలను ‘X’ సోషల్మీడియా ప్లాట్ఫామ్లో ఓ పోస్టును షేర్చేసింది దక్షిణాఫ్రికాలోని రష్యన్ ఎంబసీ. ప్రస్తుతం కాంగోలో వ్యాప్తికి కారణమవుతున్న బండిబుగ్యో ఎబోలా వైరస్ స్ట్రెయిన్ నుంచి కూడా ఈవ్యాక్సిన్ రక్షణ కల్పించగలదని ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో చెప్పినట్లు సమాచారం.
బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO), రాయిటర్స్ నివేదికల ప్రకారం, సర్వసాధారణమైన జైర్ ఎబోలా వైరస్ రకంలా కాకుండా, బుండిబుగ్యో ఎబోలా వైరస్ కోసం టీకాలులేవీ లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కాంగో,ఉగాండాలో దాదాపు వెయ్యి కేసులు నమోదు కాగా అందులో 50 శాతం మరణాలున్నాయి. వందలాది అనుమానిత కేసులు కూడా ఉన్నాయి.