BB6 TELUGU NEWS CHANNEL
పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి, రెండో విడత ఎన్నికల్లో ఎన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి? ఎంత మంది అభ్యర్థులు బరిలో నిలిచారు? అనేది తేలిపోయింది. మూడో విడత నామినేషన్ల లెక్క తేలగా.. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. 9న ఉపసంహరణ ఉంటుంది. కాగా, రెండో విడత బరిలోనిలిచిన అభ్యర్థుల లెక్క కొలిక్కి వచ్చింది. మొత్తం 4,332 గ్రామపంచాయ తీలకుగానూ 415 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. పలుకారణాలతో 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 13,128 మంది అభ్యర్థులు
బరిలో నిలిచారు. ఈ విడతలో 38,322 వార్డులకు గానూ.. ఏకంగా 8,304స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 107 వార్డుల్లోఎవరూ నామినేషన్లు వేయలేదు. ఇక మిగిలిన 29,903 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. మొత్తం 78,158మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఏకగ్రీవాల్లో కామారెడ్డి జిల్లా టాప్
రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల్లో కామారెడ్డి జిల్లా టాప్ లో నిలిచింది. ఈ జిల్లాలో 197 పంచాయతీలకు అత్యధికంగా 44 ఆ సర్పంచ్ లు ఏకగ్రీవమయ్యారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 196 సర్పంచ్లకు 38, నల్గొండ జిల్లాలో 282 సర్పంచ్లకు 38 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వార్డుల్లోనూ కామారెడ్డి జిల్లానే టాప్ నిలిచింది. ఈ జిల్లాలో 1,654 వార్డులకు గానూ 776 ఏకగ్రీవమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 1,760 వార్డులకు 674, నల్గొండ జిల్లాలో 2,418 వార్డులకు553 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కాగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా కేవలం ఒక సర్పంచ్, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో కేవలం 2 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 241, సంగారెడ్డిలో 229 పంచాయతీలకు ఎన్నికలు
9న మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ
ఈ నెల 9న మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను అధికారులు ప్రకటిస్తారు. ఇదే సమయంలో గుర్తుల కేటాయింపు ఉంటుంది. పోలింగ్ 17వ తేదీననిర్వహించనున్నారు. ఆఖరిరోజు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
సర్పంచ్ స్థానాలకు 17,405, వార్డులకు
61,562 నామినేషన్లు రావడం విశేషం.
మూడో విడతలో 4,158 పంచాయతీలకుగానూ 27,277 నామినేషన్లు దాఖలు కాగా, 36,442 వార్డులకుగానూ 89,603 మంది నామినేషన్లు దాఖలు కాగా, 36,442 వార్డులకుగానూ 89,603 మందినా మినేషన్లు వేశారు. ఈ విడత 11 సర్పంచ్100 వార్డులకు ఒక్క నామినేషన్ కూడారాలేదు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో నామినేషన్లు పెద్ద సంఖ్యలో వచ్చాయి.ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో అత్యల్పంగా నామినేషన్లు దాఖలయ్యాయి.
రెండో విడతలో 415 సర్పంచ్ లు ఏకగ్రీవం. 8,304 వార్డు స్థానాలు కూడా..
08
Dec