మహమ్మదాబాద్ మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి నరేందర్

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి నరేందర్ పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఇప్పటి వరకు దాదాపుగా 40 ఎకరాల వరి, వేరుశనగ పంటలను అంచనా వేయడం జరిగింది. అదే విధంగా పొలం మడులలో వర్షం నీరు నిలువ ఉండకుండా కాలువల ద్వారా బయటకు పంపించాలని, కింద పడిన వరిని కట్టలుగా కట్టుకోవాలని దీని వల్ల గింజ రంగు మారకుండా ఉంటుంది అని తెలియజేశారు.
కోతకు సమయం ఉన్న వరిలో తెగుళ్ల నివారణకు 2 గ్రాముల సాఫ్ మందును పిచికారి చేయాలని తెలియజేశారు.
కోతకు సిద్దంగా ఉన్న వరి పంటపైన 5 శాతం ఉప్పు ద్రావణం పిచికారి చేసుకోవాలి దీని వల్ల మొలక శాతాన్ని తగ్గించవచ్చు అని అన్నారు.
ఇందులో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారి నిఖిత, రైతులు ఆనంద్, శ్రీను, చందర్ నాయక్ మరియు ఇతర రైతులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe