ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గండీడ్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా సంకల్ప సిద్ధి కార్యక్రమం

BB6 TELUGU NEWS CHANNEL..
సంకల్ప సిద్ధి దీని ప్రధాన ఉద్దేశం ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఆ పాఠశాల నుంచి వెళ్లేటప్పుడు ఏదైనా ఒక లక్ష్యం ఎంచుకోవాలనే ఉద్దేశంతోనే వరప్రసాద్ సార్ ప్రధాన ఉద్దేశం.

గండీడ్ బాలుర ఉన్నత పాఠశాలలో శ్రీ అకెల్ల రాఘవేంద్ర చే సంకల్ప సిద్ధి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కందగట్ల వరప్రసాద్ ఫ్యామిలీ మరియు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గండీడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా

శ్రీ అకెల్ల రాఘవేంద్ర ప్రముఖ మోటివేషనల్ స్పీకర్

శ్రీ అకెల్ల రాఘవేంద్ర ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరియు ఐఏఎస్ ఐపీఎస్ ట్రేైనర్ విద్యార్థినీ విద్యార్థులను నిర్దేశించి ప్రసంగించారు  సంకల్ప సిద్ధి అనే కార్యక్రమం ద్వారా విద్యార్థిని విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం, అకాడమీ గైడెన్స్ ఇవ్వడం మరియు కెరీర్ గైడెన్స్ వంటి విషయాల గురించి, విద్యార్థులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమము ఒక సంవత్సరం పాటు జూమ్ మాధ్యమంగా జరుగుతుందని తెలిపారు.

Related News

ఈ కార్యక్రమంలో పి టి ఏ అధ్యక్షులు రవి ప్రకాష్ మే రెడ్డి ,సంగారెడ్డి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రామాచారి, వందేమాతరం ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ మాధవ రెడ్డి మరియు ప్రసాద్ సార్ ,ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానో పాధ్యాయులు శ్రీ ఆర్ జనార్ధన్ MEO ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు పదో తరగతి విద్యార్థులు పాల్గొనడం జరిగింది.విద్యా వారధి ఇన్చార్జి వి జనార్ధన్, డైరీ కో ఆర్డినేటర్ మైపాల్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.