BB6 TELUGU NEWS : 6 Aug 2025 : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడీ టీచర్ అమృత మాట్లాడుతూ తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డ కు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందజేయడం తో పాటు రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయని బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పోషకాహారం లోపం లో తలెత్తే శిశు మరణాలను అరికట్ట వచ్చని కనీసం ఆరు నెలల వరకు బిడ్డలకు తల్లిపాలు పట్టించాలని తెలియజేశారు పై పాలు కంటే తల్లిపాలు ఎంతో అవసరమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ అంగన్వాడి టీచర్ అమృతమ్మ ప్రియాంక ఆయా కేశమ్మ గర్భిణీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి గ్రామంలో తల్లి పాల వారోత్సవాలు

06
Aug