మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహణ

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ ప్రమాణ స్వీకారం సమావేశం ఘనంగా జరిగింది.

జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సమావేశంలో  ప్రభుత్వ విప్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి , టిపిసిసి జనరల్ సెక్రటరీలు,తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*టీపీసీసీ చీఫ్ స్క్రోలింగ్ పాయింట్స్*

* పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి అయితే  లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడం లక్ష్యం.

* మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ సంకల్పం.

* బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోంద. ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వకుండా నిర్లక్ష్యం చూపుతోంది

* కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా

* పదేళ్ల బిఆర్ ఎస్ ఆర్థిక విధ్వంసాన్ని ఎత్తి చూపి తీరాల్సిందే

* విజన్ లేకుండా బిఆర్ఎస్ పాలన

* సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్

* మహత్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం

* మోదీ 12 ఏళ్ల కాలంలో  అధికారం పరమావధిగా కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ విచ్చిన్నం చేసే కుట్రలు

* బీజేపీ హయంలో పెట్రోల్,డీజిల్ రెట్లు తగ్గాయా?

* 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా?

* శ్రీరాముడి పేరు చెప్పి ఓట్లు అడగడం బీజేపీ నేతల నైజం

* పిల్లల భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ కావాలి

* రాజకీయం చైతన్యం కలిగిన జిల్లా మహబూబ్ నగర్

* ప్రతి ఒక్క కార్యకర్త  కాంగ్రెస్ ప్రభుత్వ. అభివృద్ధి, సంక్షేమన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి

* కేటీఆర్ ,హరీష్ రావు నిత్యం అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

* కష్టపడితే ఫలితం వస్తుంది అనడానికి నేను పిసిసి కావడం ఓ ఉదాహరణ

* కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష 20 వేల కోట్లు గోదావరిలో పోశారు

* కాంట్రాక్టుల జేబులు నింపడం కోసం ప్రాజెక్టులు కట్టారు

* కాళేశ్వరం కాళేశ్వరం అయ్యింది