పిల్లలు తాగే పాల నుంచి వంట నూనె దాకా సర్వం కల్తీ..లైట్ తీసుకుంటే లైఫే రిస్క్ లోకి..

•టీ పొడి, అల్లంపేస్ట్, పచ్చళ్లు, పన్నీర్ వరకు..

• కుళ్లిన చికెన్, మటన్ అంటగడ్తున్నరు.. అన్నింటా హాని కారక కెమికల్స్

• మార్కెట్ నిండా కార్బైడ్ తో మాగబెట్టిన పండ్లు.. కలర్ కోసం తర్బూజకు ఇంజెక్షన్లు

• రోజూ ఏదో చోట పట్టుకుంటున్నా మారని తీరు.. ఫుడ్సేఫ్టీ వింగ్ లో వెక్కిరిస్తున్న ఖాళీలు

• తెలంగాణ, ఏపీకి కలిపి ఒక్కటే ల్యాబ్ ఉండడంతో శాంపిల్ టెస్టులు కల్తీ ఫుడ్ అని తేలినా కఠిన శిక్షల్లేవ్..ఇదే అదనుగా రెచ్చిపోతున్న అక్రమార్కులు

•కొనేముందు, తినే ముందు జాగ్రత్త! అంటున్న నిపుణులు లేదంటే అల్సర్లు, క్యాన్సర్లు, సకల రోగాలు

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ లో పసి పిల్లలుతాగే పాల నుంచి టీలో వాడే చాయ్ పత్త దాకా.. కూరల్లో వాడే నూనె మొదలు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా ఇలా ‘కాదేదీ కల్తీకనర్హం’ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వేడి వేడి అన్నంలో వేసుకుని తినే పచ్చడి, అందులో పోసుకునే నెయ్యి, చిన్నారులు ఇష్టంగా తినే ఐస్క్రీమ్స్, కిరాణా షాపుల్లో దొరికే తినుబండారాలు.. హోటళ్లలో తాగే చాయ్, అందులో ముంచుకు తినే ఉస్మానియా బిస్కెట్స్.. ఇలా ఒక్కటేమిటి సర్వం కల్తీనే.. సీజనల్ ఫ్రూట్స్ సంగతీ సరే సరి…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe