ప్రభుత్వ ఖాతా నుంచే..రూ.590 కోట్లు కొట్టేసిన బ్యాంకు ఉద్యోగులు!

BB6 TELUGU NEWS CHANNEL
చండీగఢ్: ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ లో590 కోట్ల రూపాయల అతి పెద్ద ఫ్రాడ్ జరిగింది. IDFC FIRST బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్ లో సుమారు 590 కోట్ల భారీ మోసం జరిగినట్లు సదరు బ్యాంకు పేర్కొంది. హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన ఖాతాల్లో సొమ్మును బ్యాంకు ఉద్యోగులతో పాటు కొందరు బయట వ్యక్తులు కలిసి గోల్ మాల్ చేశారు.

ఈ మోసంలో భాగస్తులుగా ఉన్న నలుగురు బ్యాంకు ఉద్యోగులను IDFCFIRST బ్యాంక్ ఉద్యోగాల నుంచి తొలగించింది. పోలీసులు ఈ మోసంపై కేసు నమోదు చేశారు. 590 కోట్ల రూపాయలంటే.. IDFC FIRST బ్యాంక్ గత త్రైమాసికంలో పేర్కొన్న 7503 కోట్ల కంటే ఎక్కువ కావడం కొసమెరుపు. ఈమోసంపై IDFC FIRST బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ రూ.590 కోట్ల మోసం ఎలా జరిగిందంటే..
హర్యానా ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న బ్యాంక్ అకౌంట్ ను క్లోజ్ చేసి.. అందులో ఉన్న డబ్బు మొత్తాన్ని మరో బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయమని హర్యానా ప్రభుత్వ సంబంధిత విభాగం నుంచి బ్యాంకుకు ఒక అభ్యర్థన వచ్చింది.
ఈ డబ్బును బదిలీ చేసే క్రమంలో..బ్యాంకు ఉద్యోగులు కొందరితో కలిసి ఈ 590 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేశారు. నలుగురు బ్యాంకు ఉద్యోగులను సస్పెండ్ చేసిన బ్యాంకు వారిని విచారించాలని నిర్ణయించింది. ఈ మోసానికి పాల్పడిన ఉద్యోగులపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను IDFC FIRST బ్యాంక్ కోరింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe