పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

BB6 TELUGU NEWS CHANNEL
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా గండీడ్ ఉన్నత  పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు వారి వారి ఇంటి నుంచి రకరకాల వంటకాలను చేసుకొచ్చి ప్రదర్శనలో ఉంచడం జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా హర్యాన్వి భాష విద్యార్థులు నేర్చుకుంటున్నారు అలాగే హర్యానా రాష్ట్రం వారు ధరించే వేషధారణ మరియు ఆహారపు అలవాట్లను ఈ కార్యక్రమంలో ప్రదర్శించడం జరిగింది. అనంతరం జరిగిన సాంస్కృతి కార్యక్రమాల్లో విద్యార్థులు ఉల్లాసంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ జనార్ధన్ దేశంలోని అన్ని భాషలు అన్ని ప్రాంతాల గురించి తెలుసుకొని అందరూ సమానం అనే భావాన్ని పెంచుకోవాలని సూచించారు
అనంతరం బహుమతులు అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో భాషోపాధ్యాయులు ఏ కృష్ణయ్య ,పుష్పలత,  తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe