మావోయిస్టు ఉద్యమానికి ముగింపు దశ.. అగ్రనేతల లొంగుబాటు.దేవ్ జీ లొంగుబాటుపై స్పందించిన ఛత్తీస్‌ఘడ్ డిప్యూటీ సీఎం

BB6 TELUGU NEWS CHANNEL
దేశంలో నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన మావోయిస్టు సాయుధ ఉద్యమం ముగింపు దశకు చేరుకున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి లొంగుబాటు చేయడం ఈ పరిణామాలకు కీలకంగా మారింది.
వరుస ఎదురుకాల్పులు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇప్పటికే ఉనికి కోల్పోయిన స్థితికి చేరిందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేక దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో వందలాది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. ఈ చర్యలకు మార్చి 31 వరకు గడువు నిర్దేశించినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే హిడ్మా సహా పలువురు కీలక మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతిచెందగా, మల్లోజుల, ఆశన్న తదితర నేతలు ఇటీవలే లొంగిపోయారు. మరోవైపు అనారోగ్యంతో విదేశాల్లో ఉన్న గణపతి పరిస్థితి కూడా చర్చనీయాంశమైంది.
ఇంకా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మొత్తం మీద దీర్ఘకాలంగా కొనసాగిన సాయుధ ఉద్యమానికి ముగింపు దశ సమీపించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేవ్ జీ లొంగుబాటుపై స్పందించిన ఛత్తీస్‌ఘడ్ డిప్యూటీ సీఎం.. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోందన్న విజయ్ వర్మ.. దేవ్‌ జీ తోపాటు మల్లా రాజారెడ్డి లొంగిపోయినట్లు సమాచారం వచ్చిందన్న విజయ్ వర్మ.. మావోయిస్టు పార్టీ చివరి అంకానికి చేరుకున్నట్లు భావిస్తున్నామన్న ఛత్తీస్‌ఘడ్ డిప్యూటీ సీఎం..

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe