సిపి ఐ(ఎం) పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి              

BB6 TELUGU NEWS CHANNEL
నార్కట్ పల్లి, సెప్టెంబర్ 12( ప్రజా జ్యోతి ): తెలుగు నేలపై జన్మించిన సిపిఐ ( ఎం) పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి  కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని నార్కట్పల్లి బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. అనంతరం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి చింతపల్లి బయన్న, చెరుకు పెద్దులు మాట్లాడుతూ.. ఢిల్లీ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా, కేంద్ర కమిటీ,సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశంలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మధ్యతరగతి ప్రజల తరపున అనేక ఉద్యమాలు పోరాటాలు ఆయన చేశారని తెలిపారు. అంతర్జాతీయ కమ్యూనిస్టుల ఐక్యత కోసం కృషి చేసిన ఏచూరి ఆశయాలు కొనసాగించడానికి మనమందరం పనిచేయడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కుమ్మరి శంకర్, కొప్పు శ్రవణ్, దండు రవి, ఆమనగంటి ఐలయ్య, కట్ట రామచంద్రం, అర్థం శ్రీనివాసులు, మిరియాల రాములు, దండు శంకరయ్య, శ్రీను, శంకర్, గోపి, నరేష్, యాదయ్య, మాధగోని సైదులు, బొంగు లింగయ్య పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe