డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం: వ్యక్తికి తీవ్ర గాయాలు.108 సిబ్బంది సత్వర సేవ

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్: రంగారెడ్డిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

కోస్గి మండలం, బుల్లోన్ పల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య (50), తండ్రి చంద్రయ్య తన సొంత గ్రామమైన బొల్లంపల్లికి పని నిమిత్తం వెళ్లి తిరిగి మహబూబ్‌నగర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రంగారెడ్డిపల్లి దగ్గర అదుపుతప్పిన ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంపై నుండి పడిపోవడంతో అతని తలకు, ఎడమ కాలికి తీవ్ర గాయాలై, కాలు విరిగింది.

బుల్లోన్ పల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య

బాధితుడు జానంపేట మండలంలోని ఓ పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది EMT స్వాతి, పైలట్ అక్బర్‌లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి అంబులెన్స్‌లోనే ప్రాథమిక చికిత్స అందించి, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వ్యక్తి వస్తువులను డాక్యుమెంట్లను కుటుంబ సభ్యులకు అందజేస్తున్న 108 సిబ్బంది

అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితుడి వద్ద ఉన్న చరవాణి, రూ.250 నగదు, చేతి గడియారం, విలువైన డాక్యుమెంట్లను కుటుంబ సభ్యులు, వైద్యుల సమక్షంలో అతని భార్య, కూతురికి 108 సిబ్బంది అప్పగించారు.

Related News