తెలంగాణ SIR లో బిగ్ డేటా – 45 లక్షల మంది అడ్రస్ మారారు!

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR లో సంచలన లెక్కలు బయటకు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 73 లక్షలకు పైగా ఫారాలు అన్‌కలెక్టబుల్ గా తేలడం కలకలం రేపుతోంది. ఇందులో అతిపెద్ద కేటగిరీ… శాశ్వతంగా అడ్రస్ మారిన వారే కావడం గమనార్హం. ఆ లెక్కలేంటో చూద్దాం..

తెలంగాణలో ఓటర్ జాబితా ప్రక్షాళన SIR ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3 కోట్ల 38 లక్షల మంది ఉన్నారు. ఇప్పటివరకు 78.3 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది.

అయితే లెక్కింపు సమయంలో బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లగా 73 లక్షల 39 వేల ఫారాలు అన్‌కలెక్టబుల్ గా తేలాయి. అంటే ఆ ఓటర్లు అక్కడ లేరు.

ఈ 73.39 లక్షల్లో కేటగిరీల వారీగా చూస్తే అతిపెద్ద షాక్ ఏంటంటే..

45 లక్షల మంది శాశ్వతంగా అడ్రస్ మారిపోయారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి, ఒక జిల్లా నుండి మరో జిల్లాకు, హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారే వీరంతా.

దీంతో పాటు చనిపోయిన వారు, డబుల్ ఎంట్రీ ఉన్న ఓటర్లు, కనిపించని ఓటర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

అంటే దాదాపు 21 శాతం ఓటర్ల వెరిఫికేషన్ కు నోచుకోలేదని అర్థం.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం..
ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల కానుంది.
ఆ తర్వాత అభ్యంతరాలు, వాదనలు స్వీకరించి,
అక్టోబర్ 19న ఫైనల్ ఓటర్ జాబితాను ప్రచురించనున్నారు.

అడ్రస్ మారిన 45 లక్షల మంది మళ్ళీ కొత్త చోట ఓటు నమోదు చేసుకోకపోతే వారి ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి తెలంగాణలో 45 లక్షల మంది అడ్రస్ మారడం అనేది రానున్న ఎన్నికలపై పెద్ద ప్రభావం చూపబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.