పేదోడి సొంతింటి కల నెరవేరుతోందన్న ఎమ్మెల్యే యరపతినేని

BB6 TELUGU NEWS       
పిడుగురాళ్ల, పేదలు,మహిళల సొంత ఇల్లు కట్టుకోలేని నిరుపేదల కళ్ళలో ఆనందం చూడాలన్న లక్ష్యంతో సొంతింటి కల నెరవేర్చే దిశగా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భాగంగా (ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) మరియు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ) ద్వారా నిర్మిం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణికి సిద్ధం అయిన 2,50,893 (రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల తొంబై మూడు) గృహలను ఈరోజు నెల్లూరు జిల్లా నాయుడుపేట నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా టిడ్కో గృహలను పంపిణీ చేస్తున్న సందర్భంగా,పిడుగురాళ్ల పట్టణంలోని కొండమోడు కోనంకి రోడ్డు నందు నిర్మించిన టిడ్కో గృహల పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్ల,ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అర్డివో మురళీకృష్ణ, టిడ్కో డి.ఈ సేతు బాబు,హోసింగ్ డి.ఈ బాలాజీ నాయక్,నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖరరెడ్డి,మున్సిపల్ కమీషనర్ ఇరువూరి శ్రీనివాసరావు,సంబందిత గృహ నిర్మాణ అధికారులు పాల్గొని 2832 గృహాలు మంజూరు అవ్వగా 1296 గృహలను లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టిడిపిలో ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరుగుతుందన్నారు.వైసిపి హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాల గురించి పట్టించుకోకుండా వైసీపీ రంగులు వేసుకుందన్నారు.వీటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టారన్నారు.నేడు కూటమి ప్రభుత్వం ఇళ్లతోపాటు రోడ్లు,నీరు, విద్యుత్,డ్రైనేజీ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు అందిస్తుందన్నారు.సమగ్ర గృహ నిర్మాణం అభివృద్ధికి మరో సోపానమన్నారు.2029 నాటికి ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు ఇవ్వటం మా ప్రభుత్వ లక్ష్యమన్నారు.రాజధానిని ఎవరో కూడా కదిలించే అవకాశం లేకుండా చట్ట బద్ధత చేశారన్నారు. అమరావతి రాజధాని పనులు పూర్తిస్థాయిలో అయిపోతే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు.టిడ్కో ఇళ్ళు పిడుగురాళ్ల కు వరమని టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6000 ఇళ్ళు మంజూరు చేయించామన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల మాట్లాడుతూ టిడ్కో ఇళ్ళు మహిళల పేరు మీద ఇస్తున్నామని, మహిళా సాధికారత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఇళ్లను ఎవరూ అమ్ముకోవద్దని, మీరు నివసిస్తూ ఉంటే అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అంగన్వాడి సెంటర్లు, హెల్త్ కేర్ సెంటర్, కిరాణా దుకాణాలతో పాటు పలు అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కూటమి ప్రభుత్వ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe