గండీడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు ఖరారు కాలేదు. హాస్పిటల్స్ తో ఒప్పందం కుదిరింది లేదు. ప్యాకేజి రేట్లు నిర్ణయించలేదు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వనేలేదు. ఈహెచ్ఎస్ చందా 1.5% మినహాయింపు పై జిఒ ఇవ్వలేదు. కానీ ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో ఈహెచ్ఎస్ చందా పేరిట ఉద్యోగుల మే నెల వేతనాల్లో 1.5% కోత విధించటాన్ని టిఎస్ యుటిఎఫ్ గండీడ్ మండల శాఖ అధ్యక్షులు గంట శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు.
విధివిధానాల గురించి అడిగితే ఆరోగ్య శాఖ ఇస్తుందని సమాధానం చెప్పిన ఆర్థిక శాఖ అధికారులు, ఆ విధివిధానాలు లేకుండానే వేతనాల్లో కోత ఎలా పెడతారని ప్రశ్నించారు.
ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యుల వివరాలు ఐఎఫ్ఎంఐఎస్ సైట్ లో ఈరోజు వరకు నమోదు చేయాలని గడువు విధించి, నిన్నటిదాకా వెబ్ సైట్ లో మార్పులు చేస్తూనే ఉన్నారు. వివరాలు పూర్తిగా తీసుకోనే లేదు. పాత నిబంధనల ప్రకారం భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరే చందా చెల్లించాలి. ఇప్పుడు ఇద్దరి నుంచి మినహాయించారు. ఆధారిత కుటుంబ సభ్యులపై స్పష్టత రానే లేదు.
నిజానికి ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం ఖరీదైన సమయంలో ఉద్యోగులు కూడా కొంత భరించాలని ప్రభుత్వం కోరినప్పుడు సంఘాలు అంగీకరించాయి. అయినా వేతనంలో 1.5% కోత నిర్ణయం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వారిలో ఉన్న సందేహాలను తొలగించి ఆరోగ్య పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాల్సిన సమయంలో….అందుకు తగిన చర్యలు తీసుకోకుండా ఇంత హడావుడిగా వేతనాల్లో కోత విధించడం ఉద్యోగుల్లో పలు అనుమానాలకు తావిస్తున్నది.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి వెంటనే జోక్యం చేసుకొని వేతనాల్లో కోతలు నిలివేయాలని డిమాండ్ చేశారు.
ఆర్థిక శాఖ తీసుకున్న ఏకపక్ష నియంతృత్వ నిర్ణయాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతుందని వారు హెచ్చరించారు
ఆరోగ్య పథకం కోతలను రద్దు చేయాలి– టీఎస్ యుటిఎఫ్
31
May