ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన తీరు పై ఘాటు వ్యాఖ్యలు.
BB6 TELUGU NEWS CHANNEL
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ఘోర నిర్లక్ష్యం కారణంగావైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన తలపాటి సూర్యకాంత్-రేణుక దంపతుల ఏడు నెలల పసికందు, వైద్యుల అనాలోచిత చర్యల వల్ల తన చేయిని కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఇది మానవత్వమే లేని చర్య అని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మోతే మండలం లో ఈ ఘటనపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో “ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తుందని ఆశిస్తే, ఇక్కడ వైద్యులు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం శోచనీయం. ఏడు నెలల పసికందు ప్రాణం కంటే ఆ చిన్నారి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేలా వైద్యులు వ్యవహరించడం క్షమార్హం కాని నేరం,” అని మండిపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు కనీస సౌకర్యాలు కల్పించలేక, వారి సంక్షేమాన్ని గాలికొదిలేసిందని గిద్దె రాజేష్ విమర్శించారు.”ఉన్న వికలాంగులకే న్యాయం చేయలేని అసమర్థ స్థితిలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని. అటువంటిది, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల నిర్లక్ష్యంతో పసిబిడ్డలను కూడా వికలాంగులుగా మారుస్తూ అన్యాయం చేయడం ఈ పాలనలోని అరాచకానికి నిదర్శనం,” అని ఆరోపించిన గిద్దె రాజేష్ పసికందు చేయి కోల్పోవడానికి కారణమైన వైద్యులు మరియు సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని.బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన నష్టపరిహారం చెల్లించడంతోపాటు.ఆ చిన్నారి భవిష్యత్తుకు భరోసా కల్పించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వీకరించాలని.ఈ ఘటనతోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని అరికట్టడానికి ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని.వైద్యుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించకపోతే, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని గిద్దె రాజేష్ హెచ్చరించారు. సంఘం మోతే మండల అధ్యక్షులు జిల్లేపల్లి శివకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజీరాల సుధాకర్ సంఘం విద్యార్థి నాయకులు కుర్షిత్ కోర్ర రమేష్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.