తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్ .. మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు

BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్రంలో పాఠశాలలకు హాఫ్ డే స్కూల్స్ షెడ్యూల్ ను విద్యాశాఖ ప్రకటించింది.మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్కూల్స్ నడపనున్నారు. పదో తరగతి విద్యార్థులకు యధావిధిగా స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం 12.30కు వడ్డించి.. ఆ తర్వాత విద్యార్థులను ఇంటికి పంపించేస్తారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకూ ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.మార్నింగ్ సెషన్లో టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇక.. ఎకడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ సమ్మర్ హాలిడేస్. 2026-27 అకడమిక్ ఇయర్ క్లాసులు జూన్ 12 నుంచి మొదలవుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe