BB6 TELUGU NEWS CHANNEL
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఎస్ఐ భాస్కరాచారి పట్టుబడడం సంచలనంగా మారింది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని ఓ వ్యక్తి నుంచి రూ.7 వేల లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా ముందస్తు ప్రణాళికతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. ఘటన అనంతరం ఎస్ఐను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ, లంచాలు డిమాండ్ చేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అవినీతి ఘటనలను వెలుగులోకి తేవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం కోరితే 1064 టోల్ ఫ్రీ నంబర్ లేదా 9440446106 వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
సివిల్ వివాదంలో జోక్యం.. లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో బోధన్ ఎస్ఐ
06
May