డీజే సౌండ్ కారణంగా కోళ్లు చనిపోయాయి. నష్టపరిహారం ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించిన యజమాని

BB6 TELUGU NEWS CHANNEL
డీజే సౌండ్ ఏం చేస్తుంది.. పెళ్లిళ్లు,ఊరేగింపు సందర్భంగా ఎంతో ఊపుతెస్తుంది.. అంతేనా.. పిల్లల నుంచి పెద్దలవరకు చెవులు చిల్లులు పడగొడ్తుంది..హార్ట్ పేషెంట్లు సహా కొందరి గుండెలు ఆగేలా చేస్తుంది.. పక్షులు, జంతువులను ఊళ్లలో నుంచి భయభ్రాంతులతో పరిగెత్తిస్తుంది. అంతేకాకుండా. మూగజీవాల ప్రాణాలు కూడా తీస్తుంది.పెళ్లిళ్లు, పేరంటాలు, ఊరేగింపులలో మన సరదా కోసం పెట్టుకునే డీజే బాక్సులు..మూగజీవాల పాలిట శాపంలా మారుతున్నాయి. ఇటీవల డీజే సౌండ్ కు కారణంగా వందల సంఖ్యలో కోళ్లు చనిపోయిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరప్రదేశ్ సుల్తాన్ పూర్ లో డీజే సౌండ్ కారణంగా తన పౌల్ట్రీ ఫామ్ లో 140 కోళ్లు చనిపోయినట్లు సబీర్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. డీజే ఆపరేటర్ కవి యాదవ్ కారణంగానే కోళ్లు చనిపోయినట్లు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు.

ఏప్రిల్ 25న సుల్తాన్ పూర్ జిల్లా రామ భద్రపూర్వ గ్రామంలో జరిగిన పెళ్లిసందర్భంగా ఈ వివాదం మొదలైంది.బాబన్ విశ్వకర్మ అనే వ్యక్తి తన కూతురుపెళ్లిలో డీజే పెట్టించాడు. అత్తారింటికిపంపే సమయంలో బరాత్ కోసం ఏర్పాటుచేసిన డీజేతో ఊరంతా మారుమోగింది.చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు తెగఎంజాయ్ చేశారు.

అయితే సబీర్ అనే వ్యక్తి పౌల్ట్రీ ఫామ్ పక్కనుంచి బరాత్ వెళ్లడంతోనే ఈ ఘటన జరిగిందని సబీర్ ఆరోపిస్తున్నారు. డీజేసౌండ్ కు కోళ్లు భయంతో చెల్లాచెదురయ్యాయని ఆరోపించాడు. డీజే వైబ్రేషన్స్ తో కోళ్లు గుండె ఆగి చనిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ కేసులో డీజే ఆపరేటర్ ను ప్రశ్నించి వదిలేశారు పోలీసులు. డీజే ఏర్పాటు చేయించుకున్న ఫ్యామిలీదా లేక డీజే ఆపరేటర్ దా అనే ప్రశ్న సోషల్ మీడియాలో ఉత్పన్నమవుతోంది.

పౌల్ట్రీ యజమానికి నష్ట పరిహారం చెల్లించేది ఎవరు..? అనే ప్రశ్నలు లేవనెత్తున్నారు. డీజే నుంచి వచ్చే సౌండ్కు మనుషులే చని పోతున్నారు.. కోళ్లెంత అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. డీజేలకు అధిక శబ్దం విషయంలో కొన్ని నిబంధనలు పెట్టి కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డీజే సౌండ్ కారణంగా కోళ్లు మృతి
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe