చనిపోయిన కానిస్టేబుళ్ల పేరుతో జీతాలు 1.40 కోట్లు స్వాహా చేసిన ఉద్యోగి..

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి..
విచారణకు ఆదేశించిన సీపీ గౌష్ ఆలం

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ కరీంనగర్, చనిపోయిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఐడీ నంబర్లను ఉపయోగించి ఓ ఉద్యోగి అక్రమంగా జీతాలు డ్రా చేసుకున్న ఘటన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. ఇలా ఇప్పటివరకు మొత్తం రూ. 1,40,18,308 దారి మళ్లినట్లు టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్ల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే.. కమిషనరేట్ పరిధిలో పేసెక్షన్లో పనిచేసే ఓ ఉద్యోగి.. గతంలో చనిపోయిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయ్ ఐడీలను ఉపయోగించి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఇతర వ్యక్తుల పేర్లను చేర్చాడు.

ఆ తర్వాత వారి పేరుతో ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచి, వాటికి తన మొబైల్ నెంబర్ లింక్ చేయించాడు. ఇలా ముగ్గురి పేరిట 2022 నుంచి ఇప్పటివరకు జీతాలు డ్రా చేశాడు. ఈవిషయం బయటకు తెలియడంతో
స్పందించిన సీపీ గౌష్ ఆలం విచారణకు
ఆదేశించారు. సీపీ ఆదేశాలతో పే సెక్షన్ ఉద్యోగిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ వన్టౌన్ సీఐ రాంచందర్రావు చెప్పారు. ఈ అక్రమంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.పూర్తి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe